Sampath Kumar:కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంట్లో అర్థరాత్రి హైటెన్షన్..

  • IndiaGlitz, [Monday,November 27 2023]

పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో ప్రచారం హీటెక్కుతోంది. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌లో ఆదివారం అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంట్లో ఐటీ, విజిలెన్స్ అధికారలమంటూ కొందరు వ్యక్తులు హల్‌చల్‌ చేశారు. ఆయన ఇంట్లోకి దూసుకెళ్లి వస్తువులు, బట్టలు, సామాగ్రిని చిందరవందరగా పడేశారు.

వచ్చిన వారిని సెర్చ్ వారెంట్ చూపాలని సంపత్ కుమార్ సతీమణి మహాలక్ష్మీ నిలదీసే సమయంలో వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదంలో ఆమె సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో హుటాహుటినా ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో అధికారులను నిర్బంధించేందుకు సంతప్ కుమార్ అనుచరులు ప్రయత్నించగా.. వారు పరార్ అయ్యారు. ఈ ఘటనపై సంపత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

తాను ఇంట్లో లేని సమయంలో కొందరు దుండగులు ఐటీ, విజిలెన్స్ అధికారులమంటూ తమ ఇంట్లో నానా హంగామా చేశారని మండిపడ్డారు. వారు నిజంగా అధికారులు కాదని.. వారి దగ్గర ఐడీ కార్డులు కూడా లేవని తెలిపారు. తన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని.. ఐటీ అధికారులైతే ఎందుకు పారి పోయారని ప్రశ్నించారు. అలంపూర్‌లో కాంగ్రెస్ గెలుస్తుందని జీర్ణించుకోలేకే అధికార పార్టీ ఈ దుశ్చర్యకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి అనుచరుల పనే అని సంపత్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మొత్తానికి ఈ ఘటనతో అలంపూర్‌లో అర్థరాత్రి పూట ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

More News

Rahul Gandhi:మోదీ-కేసీఆర్ ఒక్కటే.. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ప్రజాపాలన చూపిస్తాం: రాహుల్ గాంధీ

బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఢిల్లీలో ప్రధాని మోదీకి కేసీఆర్ సహకరిస్తారు..

Modi: కేసీఆర్ అవినీతిపై విచారణ జరుగుతోంది.. వదిలే ప్రసక్తే లేదు: మోదీ

కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ప్రధాని మోదీ తెలిపారు. నిర్మల్ జిల్లా తూప్రాన్‌ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ

Pawan Kalyan:తెలంగాణలో యువత ఆశలు నెరవేరలేదు: పవన్ కల్యాణ్

డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతోనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తెలిపారు.

Lokesh:నేటి నుంచే లోకేశ్‌ 'యువగళం' పాదయాత్ర పున:ప్రారంభం

టీడీపీ యువనేత నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర నేటి నుంచి పున:ప్రారంభం కానుంది.

Modi:తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ

తిరుమల శ్రీవారిని ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన మోదీకి అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.