ఈనెల 20న సంపూర్ణేష్ బాబు 'వైరస్' ఆడియో విడుదల!

  • IndiaGlitz, [Saturday,May 13 2017]

సంపూర్ణేష్ బాబు టైటిల్ పాత్రలో ఎ.ఎస్.ఎన్ ఫిలిమ్స్ పతాకంపై ఎస్.ఆర్.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "వైరస్". "నో వేక్సిన్, ఓన్లీ టాక్సిన్" అనేది ట్యాగ్ లైన్. సలీమ్.ఎం.డి-శ్రీనివాస్ వంగాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పుల్లరేవు రామచంద్రారెడ్డి సమర్పిస్తున్నారు. మీనాక్షీ భుజంగ్-సునీల్ కశ్యప్ ద్వయం సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రం ఆడియోను మే 20న విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సలీమ్.ఎం.డి మాట్లాడుతూ.. "హిలేరియస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన "వైరస్" సినిమా టీజర్ ను ఇటీవల విడుదల చేశాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈనెల 20న పాటల్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే చిత్రాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: మీనాక్షీ భుజంగ్-సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ: వి.జె, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, మాటలు: దుర్గాప్రసాద్ రాయుడు, నిర్మాతలు: సలీమ్.ఎం.డి-శ్రీనివాస్ వంగాల, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎస్.ఆర్.కృష్ణ!

More News

ప్రతి పోలీసు కుటంబం చూడాల్సిన చిత్రం 'రాధ' - బివిఎస్ఎన్ ప్రసాద్

యువ హీరో శర్వానంద్ హీరోగా ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ చంద్రమోహన్ దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు నిర్మాతగా రూపొందిన చిత్రం `రాధ`.

సక్సెస్ టూర్ ప్లాన్ లో 'వెంకటాపురం'

రాహుల్, మహిమా మక్వానా హీరో హీరోయిన్స్గా గుడ్ సినిమా గ్రూప్, బాహుమన్య ఆర్ట్స్ బ్యానర్స్పై వేణు మడికంటి దర్శకత్వంలో శ్రేయాస్ శ్రీనివాస్, తూము ఫణికుమార్ నిర్మాతలుగా రూపొందిన చిత్రం 'వెంకటాపురం`.

ఈ ఏడాది విడుదలయ్యే చిత్రాల్లో 'వైశాఖం' హిట్ అవుతుంది - సినిమాటోగ్రాఫర్ వాలిశెట్టి వెంకట సుబ్బారావు

ఆర్.జె. సినిమాస్ బేనర్పై డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'వైశాఖం'. సూపర్స్టార్ మహేష్ చేతుల మీదుగా ఈనెల 16న రిలీజ్ చేసిన ఈ చిత్రం ఆడియో సూపర్హిట్ అయింది.

'మాతంగి' గా శివగామి రమ్యకృష్ణ

మాగ్నమ్ ఓపస్ మూవీ ‘బాహుబలి’లో రాజమాత శివగామిగా అత్యద్భుత నటన కనబరిచిన రమ్యకృష్ణ ఇప్పుడు ‘మాతంగి’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ప్రియాంక మరో హాలీవుడ్ మూవీ...

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్ వైపు అడుగులు వేస్తుంది.