సందీప్‌ కిషన్‌ నిర్మాతగా ‘వివాహ భోజనంబు’

  • IndiaGlitz, [Monday,August 17 2020]

యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌లో అభిరుచి గల నిర్మాత, మంచి భోజన ప్రియుడు ఉన్నారు. ప్రజలకు రుచికరమైన భోజనం, వంటలు వడ్డించడానికి ‘వివాహ భోజనంబు’ అని హైదరాబాద్‌ నగరంలో, తెలుగు రాష్ట్రాల్లో రెస్టారెంట్లు ప్రారంభించి తమ సేవలు అందిస్తున్నారు. ఈ రెస్టారెంట్లు ప్రజల అభిమానాన్ని చూరగొన్నాయి. ఇప్పుడు ‘వివాహ భోజనంబు’ అని ఓ సినిమా నిర్మించడానికి సందీప్‌ కిషన్‌ శ్రీకారం చుట్టారు.

విజయవంతమైన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’తో సందీప్‌ కిషన్‌ నిర్మాతగా మారారు. వెంకటాద్రి టాకీస్‌ నిర్మాణ సంస్థను స్థాపించి ప్రొడక్షన్‌ నెం1గా ఆ సినిమా నిర్మించారు. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’లో సందీప్‌ కిషన్‌ నిర్మాణ భాగస్వామి. వెంకటాద్రి టాకీస్‌ సంస్థలో అది ప్రొడక్షన్‌ నెం2. ఇప్పుడు ప్రొడక్షన్‌ నెం3గా ‘వివాహ భోజనంబు’ నిర్మించనున్నారు.

వెంకటాద్రి టాకీస్‌, సోల్జర్స్‌ ఫ్యాక్టరీ పతాకాలపై రూపొందనున్న ‘వివాహ భోజనంబు’చిత్రానికి సందీప్‌ కిషన్‌, శినీష్‌ నిర్మాతలు. ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత పి. కిరణ్‌ (జెమిని కిరణ్‌) సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్‌ అబ్బరాజు దర్శకుడు. సోమవారం సినిమా ప్రీ–లుక్‌ విడుదల చేశారు. త్వరలో ఫస్ట్‌ లుక్‌తో పాటు ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌, ఇతర నటీనటుల వివారాలను వెల్లడించనున్నారు.

సాంకేతిక వర్గం వివరాలు: ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్ర కె. నాయుడు – ఫణి కందుకూరి, వంశీ–శేఖర్‌, కూర్పు: ఛోటా కె. ప్రసాద్‌, కథ: భాను భోగవరపు, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, ఛాయాగ్రహణం: మణికందన్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు: శివా చెర్రీ – సీతారామ్‌, సమర్పణ: పి. కిరణ్‌ (జెమిని కిరణ్‌), నిర్మాతలు: సందీప్‌ కిషన్‌, శినిష్‌, దర్శకత్వం: రామ్‌ అబ్బరాజు.

More News

మ‌రోసారి ఆయ‌న‌కే ఓటేసిన క్రిష్‌..!!

లాక్‌డౌన్ స‌మ‌యంలో ద‌ర్శ‌క నిర్మాత క్రిష్ ఖాళీగా ఉన్నాడు. అయితే ఈ ఖాళీ స‌మ‌యాన్ని క్రిష్ ఏమాత్రం వేస్ట్ చేయ‌లేదు.

‘రాధేశ్యామ్’ ప్లానింగ్ అలా చేశారా?

యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్ ప్యాన్ ఇండియా అయిన‌ప్ప‌టి నుండి ఆయ‌న సినిమాల‌పై చాలా ఫోక‌స్ పెరిగింది.

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురు

ఏపీ ప్రభుత్వానికి కోర్టులు కలిసి వస్తున్నట్టు లేదు. దాదాపు ప్రతి కేసులోనూ ఏపీ ప్రభుత్వానికి అపజయమే ఎదురవుతోంది.

‘దృశ్యం’ దర్శకుడు మృతి అంటూ పుకార్లు.. మాధవన్ సహా సంతాపం..

హిందీ ‘దృశ్యం’ దర్శకుడు నిషికాంత్ కామత్ మృతి చెందారంటూ ఆయన సన్నిహితుడు చెప్పిన మాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

సంప‌త్‌నంది క‌థ స్క్రీన్ ప్లే డైలాగ్స్‌తో కె.కె.రాధామోహ‌న్ కొత్త చిత్రం

ఏమైంది ఈవేళ‌, బెంగాల్ టైగ‌ర్ వంటి సూప‌ర్‌హిట్స్ అందించిన శ్రీ‌స‌త్య‌సాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహ‌న్ ప్రొడ‌క్ష‌న్ నెం.9గా