అలసిపోయా ఇక ఆడలేను.. ఇదే నా చివరి సీజన్ : టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సానియా

భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన టెన్నిస్ కెరీర్‌‌కు వీడ్కోలు ప్రణాళికలు వెల్లడించింది. 2022 ఏడాది ఆఖర్లో ఆటకు గుడ్‌బై చెప్పేస్తానని ప్రకటించింది. ఆస్ట్రేలియా ఓపెన్‌ 2022 డబుల్స్‌లో తొలి రౌండ్లోనే ఆమె ఓటమి చవిచూసింది. ఆ వెంటనే సానియా మీడియాతో మాట్లాడింది.

'నా చివరి సీజన్‌ ఇదేనని నిర్ణయించుకున్నా. ఇక నుంచి వారం వారం సమీక్షించుకుంటాను. వాస్తవానికి ఈ సీజన్‌ చివరి వరకు కొనసాగుతానో లేదో చెప్పలేను అంటూ సానియా మీర్జా వెల్లడించారు. 'ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని... టెన్నిస్ వల్ల తన మూడేళ్ల కొడుకును రిస్క్‌లో పెడుతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను త్వరగా అలసిపోతున్నానని... గాయాల పాలవుతున్నానని సానియా మీర్జా చెప్పారు. ఈ రోజు తన మోకాలు చాలా ఇబ్బంది పెట్టిందని సానియా తెలిపారు. తన వయసు పెరగడం వల్ల కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతోంది అని ఆమె చెప్పారు.

కాగా.. ఆస్ట్రేలియా ఓపెన్‌ మహిళల డబుల్స్‌లో సానియా ఓటమి పాలైనా అక్కడే ఉండనుంది. అమెరికాకు చెందిన రాజీవ్‌ రామ్‌తో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సానియా ఆడనుంది. సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటి వరకు సానియా ఆరు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచింది. డబుల్స్‌లో నెంబర్‌వన్ స్థాయికి సైతం చేరుకుంది. డబ్ల్యూటీఏ సింగిల్స్‌లో టాప్‌-30లో ప్రవేశించిన తొలి భారతీయురాలిగా సానియా మీర్జా రికార్డుల్లోకెక్కింది.

More News

కేంద్రానికి రూ.30,791 కోట్ల బాకీ తీర్చిన రిలయన్స్ జియో

కేంద్ర ప్రభుత్వానికి రిలయన్స్ జియో బాకీ తీర్చేసింది. స్పెక్ట్రం కేటాయింపులకు సంబంధించి రూ.30,791 కోట్ల బకాయిలను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించినట్లు జియో ప్రకటించింది.

బాలయ్య టాక్ షోలో పాల్గొనాలని వుంది... వర్మ ట్వీట్ , అంతలోనే డిలీట్

సినిమాలు, రాజకీయాలు, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి వ్యవహారాలతో క్షణం తీరిక లేకుండా వుండే బాలయ్య..

కొందరు యోధులు తయారవుతారు.. కానీ ‘‘గనీ’’ యోధుడిగా పుట్టాడు

బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకెళ్తున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. లవ్ స్టోరీలతో తనకు తిరుగులేదని నిరూపించుకున్న ఆయన..

చంద్రబాబుకు కరోనా.. ‘‘మావయ్య.. మీరు త్వరగా కోలుకోవాలి’’ : ఎన్టీఆర్ ట్వీట్

దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా వైరస్ బారినపడుతున్నారు.

ఐదుగురు హీరోయిన్లు, ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లతో ‘‘రావణాసుర’’ పాలన ప్రారంభం

మాస్ మహారాజ్ వరుస సినిమాలతో హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన చేతిలో నాలుగైదు సినిమాలు వున్నాయి.