close
Choose your channels

‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 2’... సంజ‌య్ ద‌త్ లుక్ లీక్‌

Tuesday, May 19, 2020 • తెలుగు Comments

‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 2’... సంజ‌య్ ద‌త్ లుక్ లీక్‌

య‌ష్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `కె.జియ‌ఫ్‌`. ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. అందులో `కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 1` ఇప్ప‌టికే విడుద‌లై భారీ విజ‌యాన్ని సాధించింది. ప్ర‌స్తుతం `కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2` షూటింగ్ జ‌రుగుతుంది. రెండు ఫైట్స్, కొంత టాకీ పార్ట్ మాత్రమే మిగిలి ఉంది. కాగా.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ సంజ‌య్ ద‌త్ అధీరా అనే ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో, మ‌రో కీల‌క పాత్ర‌లో ర‌వీనాటాండ‌న్ న‌టిస్తున్నారు. తాజాగా సంజ‌య్ ద‌త్ లుక్ లీకైందంటూ ఓ ఫొటో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో విడుద‌లైన `కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 1` క‌న్న‌డ‌తో పాటు తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌లై భారీ విజయాన్ని సాధించింది. హోంబ‌లే బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాకీ భాయ్‌గా య‌ష్ రాకింగ్ పెర్ఫామెన్స్‌తో రూ.200కోట్ల మేరకు సినిమా వ‌సూళ్ల‌ను సాధించింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుంది. కె.జి.య‌ఫ్ పార్ట్ 1 సాధించిన స‌క్సెస్‌తో సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. నిర్మాత‌లు ఈ అంచ‌నాల‌కు ధీటుగా సినిమాను భారీ బ‌డ్జెట్‌తో తెర‌క‌రెక్కిస్తున్నారు.

‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 2’... సంజ‌య్ ద‌త్ లుక్ లీక్‌

Get Breaking News Alerts From IndiaGlitz