సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న 'ప్రేమ్ కుమార్' గ్లింప్స్ విడుదల

  • IndiaGlitz, [Wednesday,September 01 2021]

సంతోష్ శోభన్ హీరోగా సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై.లి. శివప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమ్ కుమార్'. రాశీ సింగ్ హీరోయిన్. ఈ చిత్రంతో అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కృష్ణచైతన్య, రుచిత సాధినేని, కృష్ణతేజ, సుదర్శన్, అశోక్ కుమార్, ప్రభావతి, రాజ్ మాదిరాజు, అశోక్ కుమార్, మధు, అభిషేక్ మహర్షి, శ్రీవిద్య, సాయి శ్వేత, ఆకుల శివ ఇతర తారాగణం. బుధవారం సినిమా గ్లింప్స్ విడుదల చేశారు.

గ్లింప్స్ చూస్తే... సునందగారికి సింగిల్ సుపుత్రుడు, సుందర లింగానికి సోలో స్నేహితుడు, రోషన్ గాడికి రంకు మొగుడు, వరుడు చిరంజీవి చిం ప్రేమ్ కుమార్ అంటూ హీరోతో పాటు అతడి జీవితంలో కీలక పాత్రధారులను పరిచయం చేశారు. వధువుగా రాశీ సింగ్ ను సైతం చూపించారు. అయితే, పెళ్లి ఎందుకు ఆగిందనేది సస్పెన్స్ లో ఉంచారు. పెళ్లి కూతురు పీటలు ఎక్కకుండా ఎందుకు లేచిపోయింది అనేది చెప్పకుండా సినిమాపై ఆసక్తి పెంచారు.

దర్శకుడు అభిషేక్ మహర్షి మాట్లాడుతూ ప్రేమ్ కుమార్ పెళ్లి ఆగింది సరే. అసలు ఎందుకు, ఎవరి వల్ల, ఎవరితో, ఎలా ఆగింది? అసలు పీకే కి పెళ్లి అవుతుందా? లేక అలానే ఉండిపోయి పెళ్లి చూపులతో సరిపెట్టుకుంటాడా? ఇంతకీ, పెళ్లి ఎప్పుడు? రానున్న రోజుల్లో ఇలాంటి వాటికి సమాధానం దొరుకుతుంది. అప్పటివరకు మా తొలి శుభలేఖ ఇదే అని అన్నారు.

నిర్మాత శివప్రసాద్ పన్నీరు మాట్లాడుతూ హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా ఇది. మా దర్శకుడు అభిషేక్ మహర్షి, రచయిత అనిరుధ్ కృష్ణమూర్తి కలిసి చక్కటి ఓ సరికొత్త కథ రాశారు. కథనం ఆసక్తి కలిగిస్తూ, నవ్విస్తుంది. సంతోష్ శోభన్ పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాం అని అన్నారు.

సంతోష్ శోభన్, రాశీ సింగ్, కృష్ణచైతన్య, రుచిత సాధినేని, కృష్ణతేజ, సుదర్శన్, అశోక్ కుమార్, ప్రభావతి, రాజ్ మాదిరాజు, అశోక్ కుమార్, మధు, అభిషేక్ మహర్షి, శ్రీవిద్య, సాయి శ్వేత, ఆకుల శివ నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్రకుమార్ నాయుడు - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), డిజిటల్ మీడియా: టికెట్ ఫ్యాక్టరీ, ఎడిటర్: గ్యారీ బీహెచ్, సినిమాటోగ్రఫీ: రాంపీ నందిగాం, రచన: అభిషేక్ మహర్షి, అనిరుధ్ కృష్ణమూర్తి, అడిషనల్ డైలాగ్స్: చరణ్ తేజ్, పాటలు: కిట్టు విస్సాప్రగడ, సంగీతం: అనంత్ శ్రీకర్, నిర్మాణ సంస్థ: సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై.లి, నిర్మాత: శివప్రసాద్ పన్నీరు, దర్శకత్వం: అభిషేక్ మహర్షి.

More News

'101 జిల్లాల అంద‌గాడు' లో నా పాత్ర చాలా కీల‌కం: రుహానీ శ‌ర్మ‌

అవ‌స‌రాల శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా, రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించిన చిత్రం ‘101 జిల్లాల అంద‌గాడు’.

‘నాగ శౌర్య , రీతువర్మ’ ‘వరుడు కావలెను‘ టీజర్ విడుదల

యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ దర్శకత్వంలో  ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ రూపొందిస్తున్న చిత్రం  ‘వరుడు కావలెను‘.

సినీ పరిశ్రమ కోసం మేము కూడా ఏపీ సీఎంను కలుస్తాం: నట్టికుమార్

తెలుగు సినీ పరిశ్రమలో చిన్న నిర్మాతలు కొన్ని ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారని,

'డియర్ మేఘ' నా కెరీర్ లో ఇంపార్టెంట్ మూవీ - యంగ్ హీరో  ఆదిత్ అరుణ్

"కథ", "తుంగభద్ర", "24 కిస్సెస్", "11 అవర్" లాంటి చిత్రాలతో, వెబ్ సిరీస్ లతో గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు  అదిత్ అరుణ్.

సెప్టెంబర్ 17న డిస్నీ హాట్‌స్టార్‌లో  హీరో నితిన్ ‘మాస్ట్రో’ స్ట్రీమింగ్

హీరో నితిన్ తాజా చిత్రం ‘మాస్ట్రో’. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతుందనే సంగ‌తి తెలిసిందే.