పవన్ నుంచి సంతోష్ శ్రీన్ వాస్ కి పిలుపు..!

  • IndiaGlitz, [Thursday,September 29 2016]

కందిరీగ, ర‌భ‌స చిత్రాల ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీన్ వాస్ తెర‌కెక్కించిన తాజా చిత్రం హైప‌ర్. రామ్ - రాశీ ఖ‌న్నా జంట‌గా న‌టించిన హైప‌ర్ చిత్రం ఈనెల 30న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. అయితే...హైప‌ర్ డైరెక్ట‌ర్ సంతోష్ శ్రీన్ వాస్ కి ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచి పిలుపు వ‌చ్చింద‌ట‌.ఇంత‌కీ విష‌యం ఏమిటంటే... ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌మిళ్ లో విజ‌యం సాధించిన వేదాళ‌మ్ చిత్రం రీమేక్ లో న‌టించ‌నున్న‌ట్టు... ఈ చిత్రానికి సంతోష్ శ్రీన్ వాస్ ద‌ర్శ‌కత్వం వ‌హించ‌నున్నారు అంటూ వార్త‌లు వ‌చ్చాయి.
ఈ విష‌యం గురించి సంతోష్ శ్రీన్ వాస్ ను అడిగితే...ప‌వ‌న్ నుంచి పిలుపు వ‌చ్చిన మాట వాస్త‌వ‌మే. అయితే...ఆ టైమ్ లో నేను హైపర్ మూవీ క‌మిట్ అయ్యాను అందుచేత కుద‌ర‌లేదు అని చెప్పారు. ప‌వ‌న్ వేదాళ‌మ్ రీమేక్ ఇంకా చేయ‌లేదు కదా..! ఒక‌వేళ చేస్తే మీకే ఛాన్స్ ఉంటుందా అని అడిగితే...అది నేను చెప్ప‌లేను. ఏం జ‌రుగుతుందో చూడాలి అని చెప్పారు అది సంగ‌తి..!

More News

బుల్లితెర పై రామ్ రికార్డ్..!

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ హీరోగా యువ ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కించిన చిత్రం నేను శైల‌జ‌. అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో నేను శైల‌జ చిత్రం ఘ‌న విజ‌యం సాధించి ఫెయిల్యూర్ లో ఉన్న రామ్ కి మంచి స‌క్సెస్ ని ఇచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం బుల్లితెర పై రికార్డ్ క్రియేట్ చేసింది.

రేపు బాహుబ‌లి 2 స‌ర్ ఫ్రైజింగ్ ప్రెస్ మీట్..!

ద‌ర్శ‌క‌ధీర‌ రాజ‌మౌళి తెర‌కెక్కించిన‌ సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. తెలుగులో రూపొందిన బాహుబ‌లి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు బాహుబ‌లి 2 శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

అక్టోబర్ 1న అవికాగోర్ 'మాంజ'

అవికాగోర్ హీరోయిన్ గా ఇషాడియోల్, కార్తిక్ జయరాజ్, అనీష్ బజ్మీ, దీప్ పథక్ ఇతర ప్రధాన పాత్రధారులుగా కిషన్ శ్రీకాంత్ దర్శకత్వంలో కన్నడలో ఘనవిజయం సాధించిన చిత్రాన్ని భీమవరం టాకీస్ పతాకంపై రాజ్ కందుకూరి సమర్పణలో తుమ్మలపల్లి రామసత్యనారాయణరావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న చిత్రం "మాంజ".

నా స్టైల్ కి తగ్గట్టుగా కమర్షిల్ ఫార్మెట్ లో రామ్ ఎనర్జీ లెవల్స్ ని చూపించే చిత్రం హైపర్ - డైరెక్టర్ సంతోష్ శ్రీన్ వాస్

'కందిరీగ', 'రభస' చిత్రాలతో సూపర్హిట్స్ సాధించి టాలెంటెడ్ డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు సంతోష్ శ్రీన్వాస్. రామ్, సంతోష్ శ్రీన్వాస్ల సక్సెస్ఫుల్ కాంబినేషన్లో తాజాగా వస్తోన్న ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం 'హైపర్'.

అక్టోబర్ 1న వస్తోన్న నాగశౌర్య 'నీ జతలేక'

ప్రముఖ వ్యాపారవేత్త జి.వి. చౌదరి శ్రీ సత్యవిదుర మూవీస్ బ్యానర్ ను స్ధాపించి తొలి ప్రయత్నంగా యంగ్ సక్సెస్ ఫుల్ హీరో నాగశౌర్యతో 'నీ జతలేక' చిత్రాన్ని నిర్మించారు.