సప్తగిరి ఎక్స్ ప్రెస్ రెడీ - డా.రవి కిరణ్

  • IndiaGlitz, [Monday,October 10 2016]

కమెడియన్ గా కడుపుబ్బా నవ్విస్తున్న స్టార్ కమెడియన్ సప్తగిరి ఇప్పుడు హీరోగానూ అలరించేందుకు సిద్ధమయ్యాడు. సప్తగిరి ఎక్స్ ప్రెస్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పవార్ దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్టర్ హోమియోపతి ద్వారా వైద్యరంగంలో సేవలందిస్తున్న డాక్టర్ కె.రవికిరణ్ సాయి సెల్యూలాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకంపై తొలి ప్రయత్నంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ ఇటీవలై విడుదలైన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ కి అనూహ్యమైన స్పందన వస్తోంది.

ఈ సందర్భంగా ప్రేక్షకులతో పాటు మీడియా వారికి సప్తగిరి ఎక్స్ ప్రెస్ నిర్మాత డాక్టర్ రవికిరణ్ కృతజ్ఞతలు తెలిపారు. అలానే త్వరలోనే విడుదల కాబోతున్న తమ సినిమాను పెద్ద మనసుతో ఆదరించాలని కోరారు. సినిమా ప్రేమికుడుగా సినిమా ఎలా ఉండాలో అని మాత్రమే డిస్కస్ చేసేవాడిని. అయితే ఓ సినిమా కోసం 24 క్రాఫ్ట్స్ వారు ఎంతగా కష్డపడతారో, తపన పడతారో ఈ సినిమాతోనే నాకు తెలిసింది. ఎటువంటి అశ్లీలతకు చోటు లేకుండా.. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కలసి చూసేలా ఈ సినిమా ఉంటుంది అన్నారు.

More News

హ‌ర్ర‌ర్ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన నాగ్..!

న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున ప్ర‌స్తుతం ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రంలో న‌టిస్తున్నారు. ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు తెర‌కెక్కిస్తున్న ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రం మ‌హాబ‌లేశ్వ‌రంలో షూటింగ్ జ‌రుపుకుంటుంది.

ధనుష్‌ ధర్మయోగి ది లీడర్‌ మోషన్‌ పోస్టర్‌ రిలీజ్

'రఘువరన్‌ బి.టెక్‌' చిత్రంతో తెలుగులోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న హీరో ధనుష్‌ మరో సెన్సేషనల్‌ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ధనుష్‌ మొదటిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

తండ్రితో సినిమా చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసిన రానా..!

ద‌గ్గుబాటి రానా ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 లో న‌టిస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత రానా ఘాజీ సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే....రానా సురేష్ ప్రొడ‌క్ష‌న్ లో ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు, దీనికి తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

బాహుబ‌లి విష‌యంలో ఫ‌స్ట్ మార్క్ ప్రొడ్యూస‌ర్ కే ఇస్తాను. అందుకే...ఈగ సినిమా వ‌ర్క్ లో రాజ‌మౌళిని అభినందిస్తాను - కోడి రామ‌కృష్ణ‌

ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య సినిమాతో ద‌ర్శ‌కుడిగా కెరీర్ ప్రారంభించి....ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలు అందించడంతో పాటు 100 చిత్రాల‌కు పైగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ‌. అమ్మోరు, దేవి, అంజి, అరుంధ‌తి సినిమాల‌తో గ్రాఫిక్స్ మాయాజాలాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు చూపించారాయ‌న‌. తాజాగా కోడి రామ‌&

పూరి ఇజం రిలీజ్ డేట్ మారింది..!

డేరింగ్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం ఇజం. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మించారు.