'సారంగ ద‌రియా..' స‌రికొత్త రికార్డ్‌..

అది రమ్మన రాదురా చెలియా.. దాని పేరే సారంగ దరియా..’ అంటూ సింగర్ మంగ్లీ పాడిన పాటకు తెలుగు ప్రేక్ష‌కులు నీరాజ‌నం ప‌లుకుతున్నారు. నాగ‌ చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం ‘ల‌వ్‌స్టోరి’ చిత్రంలో రీసెంట్‌గా విడుద‌లైన ‘సారంగ ద‌రియా..’ ప్రేక్ష‌కులను మెస్మ‌రైజ్ చేస్తూ దూసుకెళ్తోంది. లేటెస్ట్‌గా ఈ పాట యాబై మిలియ‌న్ వ్యూస్‌ను చేరుకుని స‌రికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఓ పాట‌కు ఇంత ఆద‌ర‌ణ ద‌క్క‌డం ఇదే తొలిసారి అని యూనిట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. పాట విడుద‌లైన రెండు వారాల్లోనే ఇలాంటి రికార్డ్‌ను క్రియేట్ చేయ‌డం అనేది సంతోషించ‌ద‌గ్గ విష‌యం. సాయిప‌ల్ల‌వి పాట‌కు మ‌రోసారి ప్రేక్ష‌కులు బ్ర‌హ‌రథం ప‌ట్టారు.

ఇది వ‌ర‌కు సాయిప‌ల్ల‌వి మారి సినిమాలో ధ‌నుష్‌తో క‌లిసి చేసిన రౌడీ బేబీ సాంగ్‌.., ఫిదాలో వ‌రుణ్‌తేజ్‌తో క‌లిసి చేసిన వ‌చ్చిండే.. సాంగ్‌ల‌ను కూడా ప్రేక్ష‌కులు ఎంత గొప్ప‌గా ఆద‌రించారో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు ఆమె చైత‌న్య‌తో క‌లిసి చేస్తున్న ల‌వ్‌స్టోరి సినిమాలో ‘సారంగ ద‌రియా..’ పాట కూడా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోన్న పాట‌ల లిస్టులో చేరింది. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ‘ల‌వ్‌స్టోరి’ చిత్రం ఏప్రిల్ 16న విడుద‌ల‌వుతుంది.

More News

బాలీవుడ్‌కి డేట్స్ కేటాయించిన చైత‌న్య‌..?

మన టాలీవుడ్ స్టార్స్ క్ర‌మంగా బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకునే ప‌నిలో ప‌డ్డారు. కొంద‌రు పాన్ ఇండియా సినిమాల‌తో మెప్పించాల‌నుకుంటుంటే, మ‌రికొంద‌రు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి త‌మ‌దైన గుర్తింపు

సందీప్ కిష‌న్ సినిమా పేరు మారుతోంది.. కార‌ణం ఇదేనా?

యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ హీరోగా జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి ‘రౌడీ బేబీ’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన సంగ‌తి తెలిసిందే. సినిమా సెట్స్‌కు వెళ్ల‌డానికి ముందే ఈ టైటిల్‌ను

'రంగ్ దే' చిత్రం నుంచి మరో గీతం విడుదల

యూత్ స్టార్‘నితిన్, కీర్తి సురేష్‘ ల'రంగ్ దే' చిత్ర లోని మరో గీతం ఈరోజు విడుదల అయింది. కథానుసారం చిత్ర కథా నాయకుడు పరిచయ గీతం గా కనిపించే, వినిపించే ఈ సందర్భోచిత గీతం వివరాల్లోకి వెళితే

తెలంగాణ హోంమంత్రి ఓటు చెల్లనట్టేనా?

తెలంగాణలో పట్టభద్రుల స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. అయితే ఈ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న

నాన్ వెజ్ పిజ్జా ఇస్తావా?.. రూ.కోటి కట్టాలంటూ కోర్టుకెక్కిన మహిళ

ఈ రోజుల్లో సంప్రదాయం.. చట్టుబండలంటూ పెద్దగా ఎవరూ మడిగట్టుకుని కూర్చోవట్లేదు. శుబ్బరంగా దొరికిన కాడికి వెజ్జా.. నాన్ వెజ్జా అనేది చూసుకోకుండా లాగించేస్తున్నారు.