యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న ‘సారంగదరియా’

  • IndiaGlitz, [Sunday,February 28 2021]

ఒక జానపద గీతానికి ఉండే క్రేజే వేరు.. ఇక ఆ జానపద గీతానికి సాయిపల్లవి ఫుల్ ఎనర్జీతో.. గ్రేస్‌తో డ్యాన్స్‌ను ఇరగదీస్తే అబ్బో ఆ పాటను చూడటానికి రెండు కళ్లూ చాలవు. అలాంటి పాటే ‘సారంగదరియా’ ఇప్పటికే ఈ పాట పల్లవి టిక్‌టాక్ వంటి వాటిలో బాగా పాపులర్ అయ్యింది. ఈ పాటకు ఎంతో మంది డ్యాన్స్ చేశారు. అవన్నీ ఒక ఎత్తైతే సాయిపల్లవి ఎనర్జీ.. ఎక్స్‌ప్రెషన్స్.. అద్భుతం. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ‘లవ్ స్టోరీ’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఎన్ని పాటలు వచ్చిన జానపద గీతాలకు ఉండే క్రేజే వేరు. అలాంటి జానపదానికి సాయిపల్లవి వంటి ఎనర్జిటిక్‌ హీరోయిన్‌‌ స్టెప్స్‌ తోడైతే కనువిందే. అలాంటి పాటే ‘సారంగదరియా..’అంటూ వచ్చేసింది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ‘లవ్‌స్టోరీ’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనే ‘సారంగదరియా’అంటూ సాగుతున్న పాట ఉంది. తాజాగా ఈ పాటకు సంబంధించిన లిరికల్‌ వీడియోను అక్కినేని వారి కోడలు, స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేసింది.

అమిగోస్‌ క్రియేషన్స్‌పై ఈ సినిమా తెరకెక్కింది. ఇక సుద్దాల ఆశోక్‌తేజ అందించిన సాహిత్యానికి గాయని మంగ్లీ మ్యాజిక్‌ వాయిస్‌ తోడవడంతో ‘సారంగదరియా’ జానపద ప్రేమికులనే కాదు.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. పవన్‌ సీహెచ్‌ అందించిన మంచి బీట్‌తో కూడిన సంగీతం పాట కిరాక్ తెప్పిస్తోంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అదరగొట్టేసింది. వీరందరికీ తోడు హాఫ్ శారీలో సాయిపల్లవి మంచి గ్రేస్‌తో ఇరగదీసిన డ్యాన్స్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ‘లవ్‌స్టోరీ’ ఏప్రిల్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

సంక్రాంతికి పవర్ స్టార్‌ వర్సెస్ సూపర్ స్టార్ !

స్టార్ వార్ కామన్‌గా జరుగుతూనే ఉంటుంది. అదీ ముఖ్యంగా సంక్రాంతికి ఈ వార్ తప్పనిసరి అవుతుంది.

సంక్రాంతి బరిలో నిలవనున్న పవన్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’.

3 మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసిన ‘మోసగాళ్లు’ ట్రైలర్

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన మోసగాళ్లు మూవీ ట్రైలర్‌ను ఈనెల 25న మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.

వైఎస్, జగన్ దంపతుల పేర్లు కలిసొచ్చేలా డిప్యూటీ సీఎం కూతురికి నామకరణం

ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణికి ఇటీవల పాప పుట్టిన విషయం తెలిసిందే.

‘సలార్’ నుంచి కీలక అప్‌డేట్ వచ్చేసింది..

‘కేజీఎఫ్’ చిత్ర యూనిట్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోందంటే దానికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.. అదీకాకుండా ఆ చిత్రంలో ‘బాహుబలి’