స‌ర్దార్ ఆడియో రైట్స్ రేట్ అదిరింది

  • IndiaGlitz, [Saturday,January 23 2016]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇప్పుడు స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్' సినిమా సమ్మ‌ర్‌లో విడుద‌ల‌కు రెడీ అవుతుంది. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. రీసెంట్‌గా ప‌వ‌న్ కాలికి గాయం కావ‌డంతో డాక్ట‌ర్స్ వారం రోజుల పాటు రెస్ట్‌ను సూచించారు. ప‌వ‌ర్ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్స్, ఈరోస్ ఇంటర్నేషనల్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి, బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ప్రస్తుతం షెడ్యూల్ హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతుంది. ఈ సినిమా ఆడియో విడుద‌ల‌ను మార్చి 26న నిర్వ‌హించాల‌నుకుంటున్నార‌ట‌. దేవిశ్రీ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో రైట్స్ కావాలంటే కోటిన్న‌ర కావాల్సిందేన‌ట‌. ఒక‌వేళ ఈరేటుతో ఆడియో రైట్స్‌ను ఎవ‌రూ కొన‌కుంటే ఈరోస్ ఇంట‌ర్నేష‌నల్ త‌మ స్వంత ఆడియో సంస్థ టి సిరీస్ ద్వారా విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌.

More News

బాలయ్య వందో సినిమా హీరోయిన్ ఎవరంటే..

డిక్టేటర్ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలైంది.ఇప్పుడు అందరి చూపు బాలయ్య వందో సినిమాపై ఉంది.బాలయ్య తన వందో సినిమాను బోయపాటితో చేస్తాడని అందరూ అనుకున్నారు.

ప‌డేసావే..ఫ‌స్ట్ సాంగ్ లాంఛ్..

కార్తీక్ రాజు, నిత్యా శెట్టి జంట‌గా చునియ తొలి ప్ర‌య‌త్నంగా తెర‌కెక్కించిన చిత్రం ప‌డేసావే. అయాన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రూపొందిన ప‌డేసావే టీజ‌ర్ ను నాగ్, రాఘ‌వేంద్ర‌రావు లాంఛ్ చేసిన విష‌యం తెలిసిందే.

తుది దశకు చేరుకున్న 'కబాలి' షూటింగ్....

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా 'కబాలి'.ఈ సినిమాలో ఆయన లుక్ కు ఇప్పటికే చాలా మంచి స్పందన వస్తోంది.

మే నెల్లో ర‌జ‌నీకాంత్ 'క‌బాలి' విడుద‌ల‌

సౌత్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టిస్తున్న సినిమా `క‌బాలి`. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో ఆయ‌న‌ లుక్ కు ఇప్ప‌టికే చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది.

సోగ్గాడి ఓవర్ సీస్ రికార్డ్...

ఈ సంక్రాంతి రేసులో అక్కినేని నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయనా' విన్నర్ గా నిలిచింది.నాగార్జున కెరీర్ లోనే అత్యధిక వసూళ్ళను కలెక్ట్ చేస్తున్న చిత్రంగా నిలిచింది.