'సర్దార్ ' తో బ్రేక్ పడుతుందా?

  • IndiaGlitz, [Saturday,November 07 2015]

మెగా ఫ్యామిలీకి అచ్చొచ్చిన సంగీత ద‌ర్శ‌కుడుగా దేవిశ్రీ ప్ర‌సాద్‌కి మంచి పేరుంది. కానీ ఓ విష‌యంలో మాత్రం ఈ సంగీత త‌రంగం ఆ ఫ్యామిలీ హీరోల‌కు అస్స‌లు క‌లిసి రావ‌డం లేదు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త చిత్రం 'స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌'తో అయినా దానికి బ్రేక్ వేస్తాడా లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇంత‌కీ అస‌లు విష‌య‌మేమిటంటే.. 'శంక‌ర్ దాదా ఎం.బి.బి.ఎస్' కి సీక్వెల్‌గా చిరంజీవి చేసిన‌ 'శంక‌ర్‌దాదా జిందాబాద్‌'.. 'ఆర్య‌'కి సీక్వెల్‌గా అల్లు అర్జున్ చేసిన 'ఆర్య 2'కి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందించారు. హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ప‌రంగా సీక్వెల్లాంటి ఈ సినిమాల‌కు డి.ఎస్‌.పి మ్యూజిక్ వ‌ర్క‌వుట్ అయినా.. సినిమాలు మాత్రం డిజాస్ట‌ర్స్‌గా మిగిలాయి.

ఇప్పుడు.. 'గ‌బ్బ‌ర్‌సింగ్‌'కి క్యారెక్ట‌రైజేష‌న్ ప‌రంగా సీక్వెల్‌గా వ‌స్తున్న 'స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌'కి కూడా దేవిశ్రీ‌నే సంగీత ద‌ర్శ‌కుడు. మ‌రి ఈ సినిమాతో అయినా ఆ అంశానికి బ్రేక్ ప‌డుతుందేమో చూడాలి.

More News

'డిక్టేటర్ ' కి థమన్ సెంటిమెంట్

నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో యువ సంగీత సంచలనం థమన్ చేస్తున్న తొలి చిత్రం ''డిక్టేటర్''.శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

హ్యపీ బర్త్ డే టు అనుష్క

అనుష్కశెట్టి,టాలీవుడ్,కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ తెలుగులో 'రుద్రమదేవి',‘బాహుబలి’వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా రేంజ్ మరింత పెరిగింది.

హ్యపీ బర్త్ డే టు కమల్ హాసన్

సినిమా అంటే మన ఉహాకు అందని పాత్రలు,మన చుట్టూ ఉన్న జీవితాలు ఇలాంటి వాటిని ప్రస్పుటం చేస్తుంటుంది.ఇలాంటి సినిమాకు తమ నటనతో ప్రాణం పోసేవాళ్ళే నటీనటులు.

రస్నా బేబి పెళ్లి ఫిక్స్ అయ్యింది!

''ఐ లవ్ యూ రస్నా''అంటూ రస్నా బేబీగా అందరికీ తెలిసిన అంకిత లాహిరి లాహిరి లాహిరిలో చిత్రంతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమై ప్రేమలో పావని కళ్యాణ్,ధనలక్ష్మీ ఐ లవ్ యూ,

'ఆటాడుకుందాం..రా' ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

కాళిదాసు, కరెంట్‌, అడ్డా వంటి సూపర్‌హిట్‌ చిత్రాల హీరో సుశాంత్‌ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో శ్రీనాగ్‌ కార్పోరేషన్‌, శ్రీ జి ఫిలింస్‌ పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో