స‌ర్ధార్ స్పెష‌ల్ షోకి పెరుగుతున్న డిమాండ్..

  • IndiaGlitz, [Tuesday,April 05 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఉగాది కానుక‌గా ఈనెల 8న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ప‌వ‌ర్ స్టార్ దాదాపు రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత ప్రేక్షకుల ముందుకు వ‌స్తుండ‌డంతో స‌ర్ధార్ సినిమా పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. అభిమానులైతే...స‌ర్ధార్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి ఏప్రిల్ 8 ఎప్పుడు వ‌స్తుంది..? ఎప్పుడు స‌ర్ధార్ సినిమాని చూస్తామా అని ఆశ‌క్తితో ఎదురుచూస్తున్నారు.

స‌ర్ధార్ సినిమాని విడుద‌ల రోజు కంటే ఒక‌రోజు ముందు అంటే ఈనెల 7వ తేదీ రాత్రి తెలుగు రాష్ట్రాల్లో స‌ర్ధార్ స్పెష‌ల్ షోలు ప్లాన్ చేసారు. ఈ సినిమా పై ఉన్న క్రేజ్ దృష్టిలో ఉంచుకుని స‌ర్ధార్ స్పెష‌ల్ షో కి టిక్కెట్ల రేట్లు భారీగా పెంచారు. అయినా టిక్కెట్లు హాట్ కేక్స్ లా అమ్ముడైపోతున్నాయి. ముఖ్యంగా హైద‌రాబాద్లో చాలా ధియేట‌ర్స్ లో స‌ర్ధార్ స్పెష‌ల్ షోస్ ప్లాన్ చేసారు. ఈ స్పెష‌ల్ షోస్ తో రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌స్తాయ‌ని తెలుస్తుంది. ఈ సినిమా పై ప్రేక్ష‌కుల్లో ఉన్న ఇంట్ర‌స్ట్ చూస్తుంటే స‌ర్ధార్ స‌రికొత్త రికార్డులు సృష్టించ‌డం ఖాయం అనిపిస్తోంది.

More News

సూర్య ఈసారైనా హిట్ కొడతాడా?

తమిళ హీరో సూర్య ఇప్పుడు 24 సినిమా రిలీజ్ లో బిజీగా ఉన్నాడు.

బాలయ్య సినిమాలో రానా?

నందమూరి బాలకృష్ణ వందవ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఉగాది రోజున ఈ సినిమాను అధికారకంగా ప్రకటిస్తారు.

నెక్ట్స్ తెలుగు, తమిళంలో అంటున్న....

ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా డైరెక్టర్ గా కూడా పెద్ద సక్సెస్ సాధించాడు.

క‌త్తిలాంటోడు..ఇదా చిరు టైటిల్..?

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి ఎప్ప‌టి నుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు. చిరు చిన్న కూతురు శ్రీజ పెళ్లి హడావిడి అయిపోయింది కాబ‌ట్టి ఇక నుంచి చిరు ఫోక‌స్ అంతా 150వ సినిమా పైనే. త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌.

ఎన్టీఆర్ కోసం హ‌ను వెయిట్ చేస్తాడా..

అందాల రాక్ష‌సి సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై...కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాతో స‌క్సెస్ సాధించిన యువ ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి. కృష్ణ గాడి వీర ప్రేమ గాథ స‌క్సెస్ త‌ర్వాత హ‌ను ఎన్టీఆర్ తో సినిమా చేయనున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.