దీపావళికి వస్తున్న 'సర్కార్‌'

  • IndiaGlitz, [Monday,October 15 2018]

ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తారు తమిళ దర్శకుడు ఎ.ఆర్‌.మురుగదాస్‌. కమర్షియల్‌ అంశాలతోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌, సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన దిట్ట. వైవిధ్యమైన కథలతో ట్రావెల్‌ చేసే విజయ్‌కు మురుగదాస్‌లాంటి దర్శకుడు దొరికితే అభిమానులకు పండగే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో 'తుపాకీ', 'కత్తి', వంటి విజయవంతమైన చిత్రాలొచ్చాయి. ఇప్పుడీ కాంబినేషన్‌ మళ్లీ రిపీట్‌ అవుతోంది.

మురుగదాస్‌, విజయ్‌ కలయికలో తమిళంలో వస్తున్న చిత్రం 'సర్కార్‌'. కీర్తి సురేష్‌, వరలక్ష్మి శరత్ కుమార్, కథానాయికలు. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో కళానిథి మారన్‌ నిర్మిస్తున్న చిత్రమిది. అభిరుచి గల నిర్మాత, ఇటీవల నవాబ్‌తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అశోక్‌ వల్లభనేని ఈ చిత్రం తెలుగు హక్కుల్ని ఫ్యాన్సీ రేట్‌కి సొంతం చేసుకున్నారు. 'నవాబ్‌'లాంటి సూపర్‌హిట్‌ తర్వాత మురుగదాస్‌, విజయ్‌ సూపర్‌హిట్‌ కాంబినేషన్‌ మరో మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు ఆనందంగా ఉంది.

ఇప్పటితమిళంలో విడుదలైన ఫస్ట్‌లుక్‌కి, పాటలకు స్పందన అద్భుతంగా ఉంది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహిస్తాం. దీపావళి కానుకగా నవంబర్‌ 6న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తాం'' అని అశోక్‌ వల్లభనేని చెప్పారు. ఈ చిత్రానికి ఏ .ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.

More News

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై లాంఛనంగా ప్రారంభమైన సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ 'చిత్రలహరి'

'శ్రీమంతుడు, జనతాగ్యారేజ్‌, రంగస్థలం' వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను నిర్మించి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై మెగామేనల్లుడు, సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా

నితిన్‌ను సిద్ధం చేస్తున్నాట్ట‌...

నాగ‌శౌర్య హీరోగా వెంకీ కుడుముల తెర‌కెక్కించిన చిత్రం ఛ‌లో స‌క్సెస్ కావ‌డంతో ఈ యువ ద‌ర్శ‌కుడికి అవ‌కాశాలు త‌లుపు త‌ట్టాయి.

అర‌వింద‌కు చెర్రీ అభినంద‌న‌...

ఫ్యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందిన 'అర‌వింద స‌మేత‌'.. 'వీర రాఘ‌వ‌' ద‌స‌రాకు అక్టోబ‌ర్ 11న విడుద‌లైంది.

తేజ్‌తో అఖిల్ హీరోయిన్‌...

గ‌త కొంత కాలంగా మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న హీరోల్లో సాయిధ‌ర‌మ్‌తేజ్ ఒక‌రు. కెరీర్ ప్రారంభంలో వియాల‌ను అందుకున్న హీరోకి ఈ మ‌ధ్య హిట్ ద‌క్క‌న‌లేదు.

తుఫాను బాధితుల‌కు విజ‌య్‌దేవ‌ర కొండ స‌పోర్ట్‌...

నిన్న కేర‌ళలో వ‌ర‌ద‌ల కార‌ణంగా భారీ ఆస్థిన‌ష్టం, ప్రాణ న‌ష్టం జ‌రిగింది. కోట్ల మంది ప్ర‌జ‌లు ముందుకు వ‌చ్చి తమ వంతుగా స‌హ‌కారాన్ని అందించారు.