స‌రైనోడు సినిమాలో హైలైట్ ఇదే..

  • IndiaGlitz, [Thursday,April 14 2016]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం స‌రైనోడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో అల్లు అర్జున్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్, కేథ‌రిన్ న‌టించారు. ర‌కుల్ ప్రీత్ సింగ్ విలేజ్ గాళ్ గా న‌టించ‌గా, కేథ‌రిన్ ఎమ్మెల్యేగా న‌టించారు.

అల్లు అర్జున్ ని ఎమ్మెల్యే కేథ‌రిన్ కి బాడీగార్డ్ నియ‌మిస్తార‌ట‌. అయితే...కేథ‌రిన్ కి బాడీ గార్డ్ గా నియ‌మించే ముందు అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీస‌ర్ గా క‌నిపిస్తాడ‌ట‌. దేశ‌భ‌క్తిని చాటిచెప్పే ఆ స‌న్నివేశాల్లో బ‌న్ని క‌నిపించేది కొద్దిసేపే అయినా ఆ సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయ‌ని స‌మాచారం. ఈనెల 22న స‌రైనోడు సినిమాని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ కూడా బ‌న్ని కెరీర్ లో యాభై కోట్లు వ‌సూలు చేసే చిత్రంగా నిలుస్తుంద‌ని అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి..స‌రైనోడు అంచ‌నాల‌ను ఎంత వ‌ర‌కు అందుకుంటాడో చూడాలి.

More News

శ్రీరామనవమి సందర్భంగా గోపీచంద్ 'ఆక్సిజన్' ఫస్ట్ లుక్ విడుదల

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం  'ఆక్సిజన్‌'. శ్రీరామనవమి సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేశారు.

పెళ్లి ఫిక్సైన ప్రొడ్యూస‌ర్ కూతురు - డైరెక్ట‌ర్ జంప్..

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఇటీవ‌ల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై... తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం సాధించిన యువ ద‌ర్శ‌కుడు, పెళ్లి ఫిక్స్ అయిన ప్రొడ్యూస‌ర్ కూతురు క‌లిసి పారిపోయారు. ఇంత‌కీ ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రు..? ఆ నిర్మాత కూతురు ఎవ‌రు..? అని ఆలోచిస్తున్నారా..?

చైతు - అఖిల్ సినిమాల‌పై మ‌న‌సు పెట్ట‌లేద‌న్న నాగ్..

టాలీవుడ్ కింగ్ నాగార్జున మ‌నం, సోగ్గాడే చిన్నినాయ‌నా, ఊపిరి చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించి స‌రికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు.

హీరో విష్ణు కి కోపం వ‌చ్చింది..

మంచు విష్ణు - రాజ్ త‌రుణ్ కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం ఈడోర‌కం - ఆడోర‌కం. జి.నాగేశ్వ‌ర‌రెడ్డి తెర‌కెక్కించిన ఈడోర‌కం - ఆడోర‌కం చిత్రం ఈరోజు రిలీజైంది.

మనోభావాలను గౌరవించి విజయ్ పోలీసోడు టైటిల్ మార్పు

ఇళయతలపతి విజయ్ నటించిన "తెరి" చిత్రానికి  తెలుగు లో "పోలీసోడు" అనే టైటిల్ ను అనుకున్న విషయం తెలిసిందే. తేరి చిత్రానికి పోలీసోడు అనే టైటిల్ ను పెడితే బాగుంటుంది అని నిర్ణయించింది నిర్మాత  కలయిపులి ఎస్ థాను. దిల్ రాజు గారు ఈ చిత్రాన్ని తెలుగు లో కేవలం విడుదల మాత్రమే చేస్తున్నారు.