స‌రైనోడు సెన్సార్ టాక్..

  • IndiaGlitz, [Thursday,April 07 2016]

స్లైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తాజా చిత్రం స‌రైనోడు. ఈ చిత్రాన్ని బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కించారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మించారు. స‌రైనోడు సినిమాకి సెన్సార్ బోర్డ్ యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఈ చిత్రంలో హీరోయిన్ కేథ‌రిన్ ఎమ్మెల్యేగా న‌టించగా, మ‌రో హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ విలేజ్ గాళ్ గా న‌టించింద‌ట‌. ఆది పినిశెట్టి విల‌న్ గా న‌టించాడు.

ఇక సినిమా విష‌యానికి వ‌స్తే.. ఫ‌స్టాఫ్ అంతా ఎంట‌ర్ టైనింగ్ గా ఉంటుంద‌ట‌. సెకండాఫ్ కాస్త స్లోగా అనిపించినా ఓవ‌రాల్ గా స‌రైనోడు పైసా వ‌సూల్ ఎంట‌ర్ టైన‌ర్ అని టాక్. అలాగే స‌రైనోడు ర‌న్ టైమ్ 160 నిమిషాల‌ట అంటే రెండు గంట‌ల న‌ల‌భై నిమిషాలు. ఇంట‌ర్వెల్ ముందు వ‌చ్చే ఫైట్ కే కోటి రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టార‌ట‌. ఈ ఫైట్ సినిమాకి హైలెట్ అంటున్నారు. సెన్సార్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్తి చేసుకుని ఈనెల 22న రిలీజ్ కి రెడీగా ఉన్నాడు స‌రైనోడు. ఈనెల 10న వైజాగ్ లో జ‌రిగే ఫంక్ష‌న్ తో స‌రైనోడు ప్ర‌మోష‌న్ స్టార్ట్ చేయ‌బోతున్నాడు.

More News

సర్దార్ సరికొత్త ట్రెండ్...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ కు ముందే సరికొత్త రికార్డులకు తెర తీస్తుంది.

జగన్ పార్టీలో మోహన్ బాబు..?

విలక్షణ నటుడు మోహన్ బాబు...మళ్లీ రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయం తీసుకున్నారు.ప్రెస్ మీట్ పెట్టి మరీ...నేను మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నాను అని ప్రకటించేసారు.

అఖిల్ సినిమా అనౌన్స్ మెంట్....

అఖిల్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన హీరో అక్కినేని అఖిల్ ఆ సినిమాతో అనుకున్న స్థాయిలో సక్సెస్ ను సాధించలేకపోయాడు.

స‌ర్ధార్ రిలీజ్ డేట్ స్పెష‌ల్..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అయితే స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా రిలీజ్ డేట్ లో ఓ స్పెష‌ల్ ఉంది. ఏముంది రేపు ఉగాది క‌దా...అదే స్పెష‌ల్ అనుకుంటే పొర‌పాటే.

రామ్ సినిమా ముహుర్తం ఫిక్స్..

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ నేను శైల‌జ సినిమాతో స‌క్సెస్ సాధించిన త‌ర్వాత త‌దుప‌రి చిత్రానికి రెఢీ అయ్యాడు. కందిరీగ సినిమాతో విజ‌యాన్ని అందించిన సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నున్నాడు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది.