close
Choose your channels

ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి ‘డెక్కన్‌ మ్యూజిక్‌ ఛాలెంజ్‌’ ప్రారంభించిన శశి ప్రీతమ్‌, ఐశ్వర్య కృష్ణప్రియ

Monday, October 19, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి ‘డెక్కన్‌ మ్యూజిక్‌ ఛాలెంజ్‌’ ప్రారంభించిన శశి ప్రీతమ్‌, ఐశ్వర్య కృష్ణప్రియ

గాయనీ గాయకులను, బ్యాండ్స్‌ను వెలుగులోకి తీసుకు రావాలనే గొప్ప ఉద్దేశంతో సంగీత దర్శకుడు శశి ప్రీతమ్‌ సోమవారం నాడు ‘డెక్కన్‌ మ్యూజిక్‌ ఛాలెంజ్‌’ కాంపిటీషన్‌ ప్రారంభించారు. దీనికి ఆయన కుమార్తె ఐశ్వర్య క్రిష్ణప్రియ నిర్మాత. వీళ్ళిద్దరూ కలిసి ప్రారంభించిన ఈ కాంపిటీషన్‌ సుమారు 12 వారాలు సాగనుంది. ఆ తరువాత 13వ వారంలో ఫైనల్స్‌ జరగనున్నాయి.

‘డెక్కన్‌ మ్యూజిక్‌ ఛాలెంజ్‌’ ప్రారంభమైన సందర్భంగా శశి ప్రీతమ్‌ మాట్లాడుతూ ‘‘మన దగ్గర చాలామంది సంగీత కళాకారులు ఉన్నారు. వాళ్ళందరూ ప్రజలకు తెలియదు. సినిమాలో గాయనీ గాయకులు ప్రేక్షకులకు తెలుస్తారు. కానీ, వేరే వాళ్ళు బయటకు తెలియదు. గత ఐదేళ్ళుగా రాక్‌ బ్యాండ్‌ సంస్కృతి హైదరాబాద్‌లో పెరిగింది. ఇప్పుడు రాక్‌ బ్యాండ్‌ ట్రెండ్‌ అవుతున్నాయి. పబ్స్‌లో వాళ్ళకు అవకాశాలు వస్తున్నాయి. తొలుత ఇంగ్లిష్‌ పాటలతో ప్రారంభించిన బాండ్స్‌, పబ్లిక్‌ డిమాండ్‌ మేరకు తెలుగు, హిందీ పాటలనూ పాడుతున్నారు. ఏ బ్యాండ్‌ ప్రత్యేకత దానిదే. మా ‘డెక్కన్‌ మ్యూజిక్‌ ఛాలెంజ్‌’ విషయానికి వస్తే... ప్రామిసింగ్‌ సింగర్స్‌, మ్యుజీషియన్స్‌ని ఎంకరేజ్‌ చేయడానికి ప్రారంభించాం.

ప్రతి వారం ఓ రాక్‌ బ్యాండ్‌, సోలో సింగర్‌ పర్‌ఫార్మ్‌ చేస్తారు. పన్నెండు వారాల తర్వాత న్యాయనిర్ణేతలు విజేతను ఎంపిక చేస్తారు. ఫైనల్స్‌ను గ్రాండ్‌గా నిర్వహించాలని అనుకుంటున్నాం. ఒకవేళ కరోనా వల్ల కుదరకపోతే ఆన్‌లైన్‌ ఈవెంట్‌ నిర్వహిస్తాం. ప్రతి బ్యాండ్‌ ప్రయాణం, స్ట్రగుల్స్‌ తెలిసేలా నా యూట్యూబ్‌ ఛానల్‌లో ఇంటర్వ్యూ చేయబోతున్నా. విజేతలను కరతాళ ధ్వనులతో పాటు క్యాష్‌ ప్రైజులు ఉంటాయి. ఇది తొలి సీజన్‌ మాత్రమే. రెండో సీజన్‌ సైతం చేయాలనే సన్నాహాల్లో ఉన్నాం. నా కుమార్తె ఐశ్వర్య కృష్ణప్రియ సైకాలజిస్ట్‌. తనే ఈ ఛాలెంజ్‌కి ప్రొడ్యూసర్‌. హైదరాబాద్‌లో తనొక సైకాలజీ క్లినిక్‌ రన్‌ చేస్తోంది. తను పియానిస్ట్‌, వోకలిస్ట్‌ కూడా. తనకు సంగీతం అంటే ఎంతో ఆసక్తి’’ అని అన్నారు.

ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి ‘డెక్కన్‌ మ్యూజిక్‌ ఛాలెంజ్‌’ ప్రారంభించిన శశి ప్రీతమ్‌, ఐశ్వర్య కృష్ణప్రియ

ఐశ్వర్య కృష్ణప్రియ మాట్లాడుతూ ‘‘మా నాన్నగారు ఎప్పుడూ ప్రతిభావంతులను ప్రోత్సహిస్తారు. చిన్నప్పట్నుంచి నేనది గమనించా. ఈ ఛాలెంజ్‌ ద్వారా కొత్త టాలెంట్‌ను వెలుగులోకి తీసుకురావాలని అనుకుంటున్నాం. పదిహేనేళ్లుగా నేను సంగీతంతో ప్రయాణం చేస్తున్నా. సంగీతానికి ఉన్న శక్తి నాకు తెలుసు. నేను మ్యూజిక్‌ థెరపిస్ట్‌. రాక్‌ బ్యాండ్స్‌, సింగర్స్‌... అందరికీ గుడ్‌ లక్‌’’ అని అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.