ఆందోళనకరంగా శశికళ ఆరోగ్యం.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ

  • IndiaGlitz, [Friday,January 22 2021]

అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం పరప్పన అగ్రహారం జైలులో ఉన్న ఆమె గత వారం రోజులుగా స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా.. బుధవారం మధ్యాహ్నం ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. వెంటనే ఆమెను సిబ్బంది జైలు ప్రాంగణంలోనే వున్న ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోవడంతో శశికళను బెంగుళూరు శివాజీ నగర్‌లో ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా.. అక్కడ ఆమెకు వైద్యులు పలు రకాల పరీక్షలు నిర్వహించారు. కరోనాతో పాటు బీపీ, మధుమేహం, ఆక్సిజన్‌ లెవల్స్‌ తదితర పరీక్షలు నిర్వహించారు.

ఐసీయూకి తరలించిన వైద్యులు..

బీపీ, మధుమేహం నియంత్రణలోనే వున్నప్పటికీ ఆక్సిజన్‌ లెవల్స్‌ తక్కువగా వున్నట్టు తేలింది. దీంతో ఆమెను సాధారణ వార్డులోనే ఉంచి వైద్యం అందిస్తూ వచ్చారు. కానీ జ్వరం పెరుగుతూ ఉండటం.. గురువారం అర్థరాత్రి 2 గంటల సమయంలో శశికళ తీవ్ర అస్వస్థతకు గురవడం.. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వైద్యులు వెంటనే ఆమెను ఐసీయూకి తరలించారు. అక్కడ ఆర్‌టీపీసీఆర్‌ సహా వివిధ పరీక్షలు నిర్వహించగా.. శశికళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్‌గా తేలింది. జ్వరం, వెన్నునొప్పి, శ్వాస తీసుకోవడంలో శశికళ ఇబ్బందులు పడుతున్నారు. అక్రమాస్తుల కేసులో శశికళ శిక్షను అనుభవిస్తున్నారు.

ఈ నెల 27న విడుదల కాబోతున్నారని..

ఈ నెల 27న శశికళ జైలు నుంచి విడుదల కాబోతున్నారని.. ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్న తరుణంలో తీవ్ర అస్వస్థతకు గురవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. 2017లో జైలుకు వెళ్లిన శశికళ.. సత్ప్రవర్తన తదితరాల కారణంగా అనుకున్న సమయం కన్నా ముందే జైలు నుంచి విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు కోర్టు చెప్పిన జరిమానాను సైతం ఆమె చెల్లించారు. దీంతో ఈ నెల 27వ తేదీన ఆమె విడుదల కావడం ఖాయమైంది. ఆమెకు స్వాగతం పలికేందుకు ‘అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం’ అధినేత టీటీవీ దినకరన్‌, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వెయ్యి వాహనాలతో ఏర్పాట్లు చేపట్టారు. అంతా ఓకే అనుకున్న సమయంలో శశికళ తీవ్ర అనారోగ్యానికి గురవడం ఆందోళన కలిగిస్తోంది.

More News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్

ప్రస్తుతం చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

జనసైనికులతో పవన్ సమావేశం... కీలక అంశాలపై చర్చ

తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగే ఉపఎన్నికలో ఎవరు పోటీ చేయాలనే అంశంలో ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చామని....

సీరం ఇన్‌స్టిట్యూట్‌లో అగ్ని ప్రమాదం.. ఐదుగురి మృతి

ప్రముఖ ఫార్మా సంస్థ సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా(సీఐఐ)కు చెందిన నూతన ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

సుప్రీంకోర్టుకెక్కిన ఏపీ ‘పంచాయతీ'

అనుకున్నదంతా అయ్యింది.. ఏపీ ‘పంచాయతీ’ సుప్రీంకోర్టుకెక్కింది. గురువారం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం

నల్గొండలో ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి

పొట్టకూటి కోసం కూలి పనికి వెళ్లి.. తిరిగి ఇంటికి చేరుకుంటున్న తరుణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.