మరో పది రోజుల్లో శశికళ విడుదల..

  • IndiaGlitz, [Friday,October 23 2020]

దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ పదిరోజుల్లో విడుదలయ్యే అవకాశముందని ఆమె తరఫు న్యాయవాది రాజా సెంధూర్‌ పాండ్యన్‌ ప్రకటించారు. ప్రస్తుతం శశికళ బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కాగా.. గురువారం శశికళ తరుఫు న్యాయవాది చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ.. కర్నాటకలోని కోర్టులకు దసరా సెలవులు ముగిసిన అనంతరమే శశికళ విడుదలకు సంబంధించిన వార్త వెలువడే అవకాశం ఉందన్నారు. నిజానికి శశికళ వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల కావాల్సి ఉంది.

అయితే కర్ణాటక జైళ్ల శాఖ నిబంధనల మేరకు సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు ప్రతి నెలా మూడు రోజులపాటు శిక్ష తగ్గే అవకాశం ఉంటుందని సెంధూర్ పాండ్యన్ వెల్లడించారు. ఆ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఇప్పటికే శశికళ 43 నెలలపాటు పూర్తిగా జైలు శిక్ష అనుభవించారు కాబట్టి ఆమెకు 129 రోజుల శిక్ష తగ్గే అవకాశం ఉందన్నారు. కాబట్టి శశికళ ఏ సమయంలోనైనా విడుదలయ్యే అవకాశాలున్నాయన్నారు. కాగా.. విడుదలకు ముందు కోర్టు విధించిన అపరాధపు సొమ్ము రూ.10.10కోట్లను ఆమె చెల్లించాల్సి ఉందని కర్నాటక జైళ్ల శాఖ అధికారులు ఆర్టీఐ చట్టం ప్రకారం ప్రకటించారు.

అయితే అపరాధ సొమ్ము మొత్తాన్ని ఇప్పటికే సిద్ధం చేశామని.. కర్ణాటకలో కోర్టులు తెరచిన వెంటనే ఆ సొమ్ము చెల్లిస్తామని సెంధూర్ పాండ్యన్ వెల్లడించారు. ప్రస్తుతం కర్ణాటకలోని కోర్టులకు దసరా సెలవులని, ఈ నెల 26 తర్వాత కోర్టులు పునఃప్రారంభం అయిన తరువాత ఈ నెల 27న శశికళ విడుదలయ్యే అవకాశం ఉందని సెంధూర్‌పాండ్యన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా శశికళ సైతం తనకు రాసిన లేఖలో వీలైంత త్వరగా విడుదలవుతాననే నమ్మకాన్ని వెలిబుచ్చారని ఆయన తెలిపారు.

More News

దీక్షిత్ కేసు: ఏడాదిగా డింగ్ టాక్ యాప్ వాడుతున్న నిందితుడు

దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్, హత్య కేసు రిమాండ్ రిపోర్ట్‌ను పోలీసులు రూపొందించారు. ఈ రిపోర్టులో పలు విషయాలను పేర్కొన్నారు.

వావ్ అనిపించిన ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’..

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా 'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'రాధేశ్యామ్‌'.

139 మంది అత్యాచారం కేసులో డాలర్ భాయ్ అరెస్ట్

డాలర్‌ భాయ్‌ని  సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. తనపై 139 మంది అత్యాచారం చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

సిటీ సెంటర్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం..

దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై మహా నగరంలో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.

దీక్షిత్‌ను కిడ్నాప్ చేసిన గంటన్నరకే చంపేశారు: ఎస్పీ కోటిరెడ్డి

తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపిన కుసుమ దీక్షిత్‌రెడ్డి(9) కిడ్నాప్‌, హత్యకేసును పోలీసులు ఛేదించారు.