Sasivadane: ఫిబ్రవరి 1న ‘శశివదనే’ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ విడుదల

  • IndiaGlitz, [Friday,January 27 2023]

యువ కథానాయకుడు ర‌క్షిత్ అట్లూరి హీరోగా, కోమ‌లి ప్ర‌సాద్ హీరోయిన్‌గా రూపొందుతోన్న ల‌వ్ అండ్ యాక్ష‌న్ డ్రామా ‘శశివదనే’. గోదావ‌రి నేప‌థ్యంలో సినిమా తెర‌కెక్కుతోంది. గౌరి నాయుడు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.వి.ఎస్.క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ ప్రై.లి, ఎ.జి.ఫిల్మ్ కంపెనీ ప‌తాకాల‌పై సాయి మోహ‌న్ ఉబ్బ‌న ద‌ర్శ‌క‌త్వంలో అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుంది. రక్షిత్ అట్లూరి, కోమ‌లి ప్రసాద్ జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో ప్ర‌వీణ్ యండ‌మూరి, త‌మిళ న‌టుడు శ్రీమాన్‌, క‌న్న‌డ న‌టుడు దీప‌క్ ప్రిన్స్‌, జ‌బ‌ర్ద‌స్త్ బాబీ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

శుక్ర‌వారం నిర్మాత అహితేజ బెల్లంకొండ ‘శశివదనే’ టైటిల్ ప్రోమోను విడుదల చేశారు. ప్రోమోను గమనిస్తే కోమలి ప్రసాద్ దేవుడికి పూజ చేసి తులసి చెట్టుకు దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఆమె ప్రేమికుడు ఇంటి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడ‌ని తెలియ‌గానే ఆనందంతో మేడ పైకి ప‌రుగులు తీస్తుంది. ప్రోమో చాలా నేచుర‌ల్‌గా, క‌ల‌ర్‌ఫుల్‌గా ఆక‌ట్టుకుంటోంది.

హ‌రి చ‌ర‌ణ్, చిన్మ‌యి శ్రీపాద పాడిన ఈ పాట‌ను సినిమాలో తొలి పాట‌గా అల‌రించ‌నుంది. శ్ర‌వ‌ణ వాసుదేవ‌న్ సంగీతం అందించిన సంగీతం చాలా క్యూట్‌గా ఉంది. కిట్టు విస్సాప్ర‌గ‌డ సాహిత్యం ట్యూన్‌కు త‌గ్గ‌ట్లు అందంగా ఉన్నాయి. శ‌శివ‌ద‌నే పూర్తి టైటిల్ సాంగ్‌ను మేక‌ర్స్ ఫిబ్ర‌వ‌రి 1న రిలీజ్ చేస్తున్నారు. ఈ వింటేజ్ మెలోడి త‌ప్ప‌కుండా ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని మేక‌ర్స్ తెలిపారు.

కోన‌సీమ‌, అమ‌లాపురం త‌దిత‌ర ప్రాంతాల్లో 50 రోజుల‌కు పైగానే ఈ సినిమాను చిత్రీక‌రించారు.

న‌టీన‌టులు: ర‌క్షిత్ అట్లూరి, కోమ‌లి ప్ర‌సాద్‌, శ్రీమాన్‌, దీపిక్ ప్రిన్స్‌, త‌దిత‌రులు

More News

Jamuna : మూడేళ్ల పాటు నిషేధం.. ధైర్యంగా నిలబడ్డ జమున, నాగిరెడ్డి-చక్రపాణి జోక్యంతో రాజీ

ఇప్పుడంటే చిత్ర పరిశ్రమలో ఇష్టారాజ్యంగా తయారైంది కానీ ఒకప్పుడు షూటింగ్‌కు నటీనటులంతా షూటింగ్‌కు దర్శక నిర్మాతలు చెప్పిన టైమ్‌కి వచ్చేసేవారు.

VK Naresh: ఆస్తి ఇవ్వలేదని నన్ను చంపేందుకు సుపారీ, రఘువీరా రెడ్డితోనూ బెదిరింపులు.. రమ్యపై నరేష్ సంచలన ఆరోపణలు

చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరో నరేశ్, పవిత్రా లోకేష్‌ల వ్యవహారం ఎంతటి కలకలం రేపిందో తెలిసిందే.

Jamuna :సత్యభామ పాత్రకు జీవం పోశారు.. జమునకు చిరు, బాలయ్య, పవన్ సంతాపం

అలనాటి నటి, తెలుగు వారి సత్యభామ జమున కన్నుమూయడంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది.

Jamuna : టాలీవుడ్‌లో మరో విషాదం.. అలనాటి నటి జమున కన్నుమూత

గతేడాది కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ వంటి దిగ్గజాలను కోల్పోయి శోకసంద్రంలో మునగిపోయిన తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త ఏడాదిలో మరో షాక్ తగిలింది.

Pawan Kalyan:మళ్లీ ఏపీ విభజన అంటే  నా అంత ఉగ్రవాది ఉండడు.. తోలు తీస్తా : పవన్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదే‌లోని వైసీపీ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో