సతీష్ మాలెంపాటి డైరెక్షన్ లో మర్డర్ మిస్టరీ 'సమిధ'

  • IndiaGlitz, [Wednesday,September 30 2020]

షార్ట్ ఫిలిం మేకింగ్ ద్వారా తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులుగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం మరొక షార్ట్ ఫిలిం మేకర్ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేస్తున్నారు. 'మర్మం' ,'కనులు కలిసాయి' లాంటి ఐదు షార్ట్ ఫిలిమ్స్ ని రూపొందించి ఇప్పుడు వెండితెర‌కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు సతీష్ మాలెంపాటి. సెప్టెంబర్ 30 ద‌ర్శ‌కుడు స‌తీష్ మాలెంపాటి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న తొలిచిత్రం 'సమిధ' టైటిల్ లోగో పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు సతీష్ మాలెంపాటి మాట్లాడుతూ - నేను గతంలో ఐదు షార్ట్ ఫిలిమ్స్ డైరెక్ట్‌ చేశాను. అలాగే చాలా యాడ్ ఫిలిమ్స్ చేసిన అనుభవం కూడా ఉంది. ఆ అనుభ‌వంతో ఇప్పుడు ఒక మూవీకి దర్శకత్వ భాద్యతలు చేపట్టాను. ఒక య‌దార్ధ గాథ‌ని ఇన్స్‌పిరేష‌న్‌గా తీసుకుని మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా అన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో స‌మిధ చిత్రాన్ని రూపొందిస్తున్నాను. నా బర్త్ డే రోజు 'స‌మిధ' లోగో పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌డం చాలా హ్యాపీ గా ఉంది. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన అరుణం ఫిలిమ్స్ వారికి థాంక్స్‌. 'సమిధ' అనేది అచ్చ తెలుగు పదం. ఈ క‌థ‌కు హండ్రెడ్ ప‌ర్సెంట్ ఈ టైటిల్ యాప్ట్‌‌. ఇది మంచి కంటెంట్ బేస్డ్ ఫిలిం. 'చావు రెండు సంద‌ర్భాల్లో వ‌స్త‌ది ఎవ‌రికైనా..' అనేది ఈ సినిమా క్యాప్ష‌న్‌. ఈ పాయంట్ చూట్టూ క‌థ ర‌న్అ‌వుతుంది. అన్వేష‌ణ, ఏజెంట్ సాయి శ్రీ‌నివాస్ ఆత్రేయ చిత్రాల జోన‌ర్‌లో చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా అంద‌రినీ థ్రిల్ చేస్తుంది. ప్ర‌ముఖ హీరోహీరోయిన్‌లు న‌టించే ఈ చిత్రంలో పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌వికాలేతో పాటు మ‌రికొంత‌మంది ప్ర‌ముఖ న‌టీన‌టులు ముఖ్య‌పాత్ర‌లు పోషిస్తారు. డిసెంబ‌ర్‌లో షూటింగ్ ప్రారంభించి ఒకే షెడ్యూల్‌లో పూర్తిచేసి 2021 స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా రిలీజ్ చేస్తాం'' అన్నారు.

More News

'షాదీ ముబారక్‌' ఫస్ట్‌ లుక్‌ విడుదల

సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు, శిరీష్‌ నిర్మాతలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'షాదీ ముబారక్‌'.

టాలీవుడ్‌కు కమెడియన్ల కొరత.. !

టాలీవుడ్‌లో కమెడియన్ల కొరత చాలా ఉంది. బ్రహ్మీ స్లో అయ్యాక మేకర్స్‌కు ఈ సమస్య ఎదురవుతోంది.

పెళ్లి పీటలెక్కబోతున్న యాంకర్ ప్రదీప్.. రాజకీయ నేత కూతురితో ఫిక్స్!

బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు యాంకర్ ప్రదీప్. చాలా మంది మేల్ యాంకర్లు ఉన్నప్పటికీ స్పాంటేనియస్‌గా మాట్లాడుతూ..

ఆ మాటలను నేను ఒప్పుకోను : అనుష్క

లేడీ ఓరియంటెడ్ మూవీస్ తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకున్న హీరోయిన్ అనుష్క.

ఆరని.. ‘రోబో-మనుషులు’ మంటలు..

ఇవాళ బిగ్‌బాస్‌లో చెప్పుకోదగిన విషయాలేమీ పెద్దగా లేవు. ఒక్క గేమ్‌తో నడిపించారు. ఆ గేమ్‌ కూడా అంత ఆసక్తికరంగా అనిపించలేదు.