కట్టప్ప కుటుంబంలో విషాదం

  • IndiaGlitz, [Tuesday,December 07 2021]

సీనియర్ నటుడు సత్యరాజ్‌ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన చెల్లెలు కల్పన మండ్రాదియార్‌(66) శనివారం సాయంత్రం కన్నుమూశారు. తమిళనాడు రాష్ట్రం తిరుప్పూర్‌ జిల్లా గాంగేయంలో నివసిస్తున్న కల్పన కొద్దివారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆమెను కుటుంబసభ్యులు కోయంబత్తూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఈ క్రమంలో కల్పన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. దీంతో సత్యరాజ్‌ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సత్యరాజ్‌ సోదరి మృతి పట్ల టాలీవుడ్‌, కోలీవుడ్‌ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

దక్షిణ భారతదేశంలోని విలక్షణ నటుల్లో సత్య రాజ్ ఒకరు. ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన ఆయన వివిధ భాషల్లోనూ నటించి మంచి నటుడిగా నిరూపించుకున్నాడు. అయితే ఎన్ని సినిమాల్లో నటించినా రాని గుర్తింపు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలితో వచ్చింది. ఈ సినిమాలో కట్టప్పగా సత్యరాజ్.. భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అంతేకాదు ఆ తర్వాత వరుసగా పలు క్రేజీ ప్రాజెక్ట్‌ల్లో ప్లేస్ కొట్టేశారు.

తొలి నాళ్లలో విలన్‌గా నటించిన సత్యరాజ్ .. 1985లో కార్తిక్ రఘునాథ్ రూపొందించిన ‘సావి’ చిత్రంలో తొలిసారి హీరోగా నటించారు. ఆ తర్వాత నడిగమ్, బ్రమ్మ, రిక్షామామ, కళ్యాణ గలాట్టా, సుయంవరమ్, మలబార్ పోలీస్” వంటి చిత్రాలు మంచి ఆదరణ పొందాయి. హీరోగా తన ప్రభ తగ్గుతున్నట్లు గ్రహించిన సత్యరాజ్ వెంటనే సపోర్టింగ్ యాక్టర్‌గా మారిపోయారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. కూతురు దివ్య, తనయుడు సిబిరాజ్. తండ్రిలాగే సిబిరాజ్ సైతం నటనలో అడుగుపెట్టాడు. సత్యరాజ్ “లీ, నాయిగల్ జాకిరతై, సత్య” వంటి చిత్రాలను నిర్మించారు. ‘విల్లాది విలన్’ అనే చిత్రానికి దర్శకత్వం కూడా నిర్వహించారు.

More News

పుష్ప ట్రైలర్ : ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్...!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమా‌పై పరిశ్రమలో భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే.

బన్నీ అభిమానులకు ‘‘పుష్ప’’ టీం షాక్.. ట్రైలర్ వాయిదా, కారణమిదే..?

ఈ మధ్యకాలంలో మేకర్స్ .. అభిమానుల సహనంతో ఆడుకుంటున్నారు. మొన్నామధ్య ‘‘రాధేశ్యామ్ ’’ మొదటి పాట రిలీజ్ విషయంలో రగడ నడిచింది.

'వెన్నుపోటు' అంటేనే కన్నీళ్లొస్తున్నాయి... బాలయ్య 'అన్ స్టాపబుల్' ప్రోమో వైరల్

తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు రాజకీయ జీవితం మహోన్నతంగా వెలుగొంది..

'రిపబ్లిక్' మూవీ కాదు, మూమెంట్... 'జీ 5'లో సినిమాను ఉద్యమంలా వీక్షించిన ప్రజలు

ప్రేక్షకులకు కేవలం వినోదం అందించడం మాత్రమే తమ బాధ్యత అని 'జీ 5' అనుకోవడం లేదు. వినోదాత్మక సినిమాలు,

భారతీయుడు 2: కాజల్ ప్లేస్‌లో తమన్నా.. రూమర్స్‌కి త్వరలోనే క్లారిటీ..!!

తమిళ దర్శక దిగ్గజం శంకర్, విలక్షణ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘‘ఇండియన్ 2’’