close
Choose your channels

'ఎంత మంచివాడ‌వురా' త‌ప్ప‌కుండా అన్ని వర్గాల ప్రేక్ష‌కుల‌కు నచ్చుతుంది - స‌తీశ్ వేగేశ్న‌

Tuesday, January 14, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎంత మంచివాడ‌వురా త‌ప్ప‌కుండా అన్ని వర్గాల ప్రేక్ష‌కుల‌కు నచ్చుతుంది - స‌తీశ్ వేగేశ్న‌

జాతీయ అవార్డ్ ద‌క్కించుకున్న శ‌త‌మానం భ‌వ‌తి వంటి చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్న‌. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `ఎంత మంచివాడ‌వురా`. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణప్రసాద్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సంక్రాంతి సంద‌ర్భంగా ఈ చిత్రం జ‌న‌వ‌రి 15న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్న‌తో ఇంట‌ర్వ్యూ...

సంక్రాంతి స‌తీశ్ అయ్యారని అన‌నుకుంటున్నారా?

అయ్యో లేదండీ!.. సంక్రాంతికి విడుద‌ల‌వుతున్న నా రెండో చిత్ర‌మిది. మంచి స‌క్సెస్ సాధించాల‌ని కోరుకుంటున్నాను.

`ఎంత మంచివాడ‌వురా`లో ఏం చెప్పాల‌నుకుంటున్నారు?

మంచి అనే విష‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకున‌దే. ప్ర‌పంచంలో ఉండేదే. ఇందులో హీరో క్యారెక్ట‌ర్ ఎదుటివారికి ఏదైనా స‌మ‌స్య‌, బాధ ఉంటే దాన్ని త‌గ్గించే క్యారెక్ట‌ర్‌. త‌న క్యారెక్ట‌ర్‌ను బేస్ చేసుకునే ఈ టైటిల్‌ను పెట్టాం. ఒక మ‌నిషికి ప్రేమ‌, ఆప్యాయ‌త‌ను పంచాలంటే వారు మ‌న బంధువులు, స్నేహితులే కాన‌వ‌స‌రం లేదు. స‌మ‌స్య‌ల్లో ఉండేవారికి మ‌నం ప్రేమ‌, ఆప్యాయ‌త‌లు ఇచ్చి సంతోష‌ప‌డిన‌ప్పుడు వారూ మ‌న మ‌న‌సుకు చుట్టాలే.

క‌థ రాసుకున్న త‌ర్వాత హీరోగారిని క‌లిశారా? లేక హీరోను క‌లిసిన త‌ర్వాత ఈ క‌థ‌ను రాసుకున్నారా?

క‌థ కోస‌మే క‌ల్యాణ్‌రామ్‌గారండి. హీరోల‌ను దృష్టిలో పెట్టుకుని క‌థ‌లు రాసుకుంటే ఎక్క‌డో ఒక‌చోట వారి ఇమేజ్ కోసం మ‌నం కాంప్ర‌మైజ్ కావాల్సి ఉంటుంది. అదే క‌థ రాసుకున్న త‌ర్వాత ఏ హీరో అయితే బావుంటాడ‌ని అనుకుని వారిని సంప్ర‌దించి ఒప్పిస్తే.. త‌ర్వాత చిన్న చిన్న మార్పులేమైనా ఉంటే చేసుకోవ‌చ్చు.

ఈ క‌థ‌కు క‌ల్యాణ్‌రామ్ ఎలా యాప్ట్ అవుతాడ‌నిపించింది?

ఎప్పుడూ ఓ జోన‌ర్‌లో సినిమాలు చేసేవారు డిఫ‌రెంట్‌గా చేస్తే ప్రేక్ష‌కుల్లో ఓ ఆస‌క్తి ఏర్ప‌డుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు క‌ల్యాణ్‌రామ్‌గారు చాలా యాక్ష‌న్ సినిమాలు చేశారు. ఆయ‌న‌తో నేను మ‌ళ్లీ అలాంటి సినిమానే చేస్తే ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ఆస‌క్తిగా అనిపించ‌దు. అదే నేను ఓ కూల్ సినిమా చేస్తే ప్రేక్ష‌కుల‌కు కొత్త‌గా అనిపిస్తుంది. అలాగే నా క‌థ‌కు ఓ మెచ్యూర్డ్ వ్య‌క్తి అవ‌స‌రం. అప్పుడు నాకు క‌ల్యాణ్‌రామ్‌గారే ఐడియాకు వ‌చ్చారు. క‌ల్యాణ్‌రామ్‌గారు అన్‌స్క్రీన్ కోపంగా క‌న‌ప‌డతారు. కానీ.. ఆఫ్ స్క్రీన్ చాలా కూల్‌గా, న‌వ్వుతూ ఉంటారు. కాబ‌ట్టి ఆయ‌న్ని క‌లిశాను. ఆయ‌న్ని క‌లిసి క‌థ చెప్ప‌గానే ఆయ‌న‌కు న‌చ్చింది.

మంచి గురించి చెప్పేట‌ప్పుడు యాక్ష‌న్ ఎలిమెంట్స్ ఎందుకు?

నా గ‌త రెండు చిత్రాల్లో యాక్ష‌న్ చేయ‌డానికి స్కోప్ లేదు. అవ‌కాశం కూడా లేదు. కానీ ఈ సినిమాలో క‌థానుగుణంగా యాక్ష‌న్ అస‌వ‌ర‌మైంది. కల్యాణ్‌రామ్‌గారి కోసం నా పంథాను మార్చుకోలేదు. కథలో అవసరం మేరకు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాను. అంతే తప్ప నేను యాక్షన్ సినిమాలు చేయగలనని నిరూపించుకోవడానికి ఈ సినిమా చేయలేదు.

మీ గత చిత్రానికి, దీనికి డిఫరెన్స్ ఏంటి?

సంప్రదాయాలను ఎక్కడో వదిలేస్తున్నాం.. పెళ్లి గురించి చెప్పాలని చేశాను. శ్రీనివాస కల్యాణంతో మనకు తెలసిన దాన్ని నలుగురు చెప్పాలి అనడం కోసం సినిమా చేయకూడదనే విషయం తెలిసింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమా చేయాలని చేసిన సినిమా.

రీమేక్ చేయడం వెనుక కారణమేంటి?

నిజానికి నా దగ్గర చాలా కథలున్నాయి. రీమేక్ చేూయాలనే ఆలోచన లేదు. ఆ సమయంలో నిర్మాత ఉమేష్ గుప్తగారికి ఆయన స్నేహితుడు గుజరాతీ సినిమా ‘ఆక్సిజన్’ గురించి చెప్పాడట. ఆయన కృష్ణ ప్రసాద్‌గారికి చెప్పాడట. ఆయన బేసిక్‌గానే రైటర్ ఆయనకు నచ్చుతుందో లేదో అని అన్నారట. సరే..ఓసారి ఆ సినిమాను చూడమనండి అని ఉమేష్‌గారు అన్నారట. కృష్ణప్రసాద్‌గారు నాకు విషయం చెప్పగానే నేను మంచి సినిమా అయితే చేద్దాం సార్... ముందుగానే ఆ సినిమా కోర్ పాయింట్ బాగా నచ్చింది. చాలా చేంజస్ చేయాలని చెప్పాను. తెలుగు నెటివిటీ ప్రకారం కథను వీలైనంత మార్చేస్తా అని అన్నాను. నిర్మాతలు ఒప్పుకోవడంతో సినిమా స్టార్ట్ అయ్యింది.

ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు?

మన చుట్టూ పిల్లలకు దూరంగా ఉండేవాళ్లు చాలా మంది ఉంటారు. అలాంటి వారిని మనం పలకరిస్తే వాళ్లు హ్యాపీగా ఫీలవుతారు అనే అంశాన్ని ఈ సినిమా ద్వారా చెప్పాం. ఈ సినిమాను చేసేటప్పుడు నేను పెద్దగా ఏం ఆలోచించలేదు. ఏ సినిమాకైనా ఓ భయముంటుంది. కానీ సినిమా రన్నింగ్‌లో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇచ్చే ఫీడ్ బ్యాక్ మనకు కాన్ఫిడెంట్‌నిస్తుంది. ఈ సినిమాలో అలాంటి ఫీడ్ బ్యాక్ చాలానే వచ్చింది.

మెహరీన్‌ని హీరోయిన్‌గా తీసుకోవడానికి రీజనేంటి?

మెహరీన్ ఎఫ్ 2లో చక్కగా నటించింది. కామెడీ బాగా చేసింది. ఎవరైతే కామెడీ బాగా చేస్తారో వారు ఎమోషన్స్ కూడా బాగా పండిస్తారు. అందుకనే మెహరీన్‌ని హీరోయిన్‌గా తీసుకున్నాం.

ఫ్యామిలీ చిత్రాల దర్శకుడనే ఇమేజ్ మీకు ప్లస్సా, మైనస్సా?

ప్లస్ అవుతుందండీ..

నెక్ట్స్ మూవీ?

‘ఎంత మంచివాడవురా’ రిలీజ్ తర్వాత తర్వాత చిత్రం గురించి ఆలోచిస్తాను.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Login to post comment
Cancel
Comment