సత్య దేవ్, తమన్నా జంటగా కన్నడ మూవీ లవ్ మాక్ టైల్ తెలుగు రీమేక్

  • IndiaGlitz, [Tuesday,July 14 2020]

డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో తనదైన శైలిలో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో సత్య దేవ్. ఇక తెలుగునాట మిల్కీ బ్యూటీ తమన్నా కి ఉన్న స్టార్ డం గురించి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ జంటగా కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన లవ్ మాక్ టైల్ సినిమాను తెలుగు లో రీమేక్ చేయడానికి రంగం సిద్ధం అయ్యింది. నాగ శేఖర్ మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా భావన రవి నిర్మాతగా నాగ శేఖర్ స్వీయ నిర్మాణ దర్సకత్వంలో ఈ బ్లాక్ బస్టర్ రీమేక్ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ని సెప్టెంబర్ మధ్య వారంలో స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా దర్శక నిర్మాత నాగ శేఖర్ తెలిపారు. అలానే ఈ చిత్రానికి హ్యాపెనింగ్ మ్యూజిక్ సెన్సేషన్ స్వరవాణి కీరవాణి వారసుడు కాల భైరవ సంగీతాన్ని అందిస్తున్నారు. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని దర్శక నిర్మాత నాగ శేఖర్ అన్నారు.

తారాగణం : సత్య దేవ్, తమన్నా

More News

కరోనా మళ్లీ మళ్లీ సోకవచ్చు: లండన్ కింగ్స్ కాలేజ్

కరోనా మళ్లీ సోకుతుందో.. లేదో అనే సందేహాలకు లండన్‌లోని కింగ్స్ కాలేజ్ పరిశోధనలు చెక్ పెట్టాయి.

ఆయన తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.. ఆ స్థానంలోకి ఎవరొస్తారు?

ఏపీలో చెప్పుకోదగిన ఉద్యమాల్లో ఒకటి కాపు ఉద్యమం. తుని ఘటన రాష్ట్ర చరిత్రలోనే మరిచిపోలేనిది.

తెలంగాణలో నిన్న మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు

తెలంగాణలో సోమవారం మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. అంతకు ముందు మూడు రోజులు కరోనా పాజిటివ్ కేసులు 1200 లోపు మాత్రమే నమోదయ్యాయి.

విశాఖ సాల్వెంట్స్ సంస్థలో భారీ అగ్ని ప్రమాదం.. భారీ పేలుళ్లు..

విశాఖ ప్రమాదాలకు పుట్టినిల్లుగా మారుతోందేమో అనిపిస్తోంది.. ఈ మధ్య జరుగుతున్న వరుస ఘటనలను చూస్తే..

ప‌వ‌న్ భ‌క్తుడి పాత్ర‌లో ఆర్జీవీ?

ప‌వ‌ర్‌స్టార్‌,జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు భారీ అభిమాన గ‌ణం సొంతం. జ‌యాప‌జ‌యాల‌కు అతీతంగా ఆయ‌నకు అభిమానులుంటడ‌మే ఆయ‌న క్రేజ్‌కు నిద‌ర్శ‌నం.