Satyadev: సత్యదేవ్ 26 చిత్రం ప్రొడక్షన్ నెం.1 షూటింగ్ ప్రారంభం

  • IndiaGlitz, [Friday,September 30 2022]

వెర్సటైల్ హీరో సత్యదేవ్‌ 26వ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. మల్టీ స్టారర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ డాలీ ధనంజయ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రం ధనంజయ కూడా 26వ చిత్రమే. ఓల్డ్ టౌన్ పిక్చర్స్ ప్రొడక్షన్ నంబర్ 1 గా నిర్మాతలు బాల సుందరం, దినేష్ సుందరం క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్ ఈరోజు ప్రారంభమైయింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో సత్య దేవ్, ధనంజయ, నిర్మాతలు కనిపించారు. పోస్టర్‌పై కరెన్సీ నోట్లు కూడా కనిపించడం ఆసక్తికరంగా వుంది.

మణికంఠన్ కృష్ణమాచారి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చరణ్ రాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. మీరాఖ్ డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రానికి అనిల్ క్రిష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఇతర ప్రముఖ నటీనటులను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.

తారాగణం: సత్యదేవ్, డాలీ ధనంజయ

More News

Adipurush: 'ఆదిపురుష్' పోస్టర్ రిలీజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతిహాస నేపథ్యంతో దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

'జూనియర్' సినిమా టైటిల్ విడుదల

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం ప్రస్తుతం కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరిటీ రెడ్డిని హీరోగా

BiggBoss: చంటి vs గీతూ.. గువ్వ పగులగొడతానన్న ఆదిరెడ్డి, ప్రేక్షకుల్ని ఏడిపించిన రేవంత్

బిగ్‌బాస్ హౌస్‌లో రెండ్రోజులుగా జరుగుతోన్న హోటల్ టాస్క్‌కి ఎండ్ కార్డ్ పడింది. అనంతరం కెప్టెన్సీ టాస్క్ మొదలైంది.

Krishnam Raju: కృష్ణంరాజు సంస్మరణ సభలో లక్ష మందికి విందు... మెనూలో 30 రకాల వెజ్, నాన్ వెజ్ ఐటెమ్స్

ఇటీవల కన్నుమూసిన దిగ్గజ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ గురువారం ఆయన స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జరిగింది.

Abortion rights : పెళ్లికాని స్త్రీలు అబార్షన్ చేయించుకోవచ్చు... సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు

సాధారణంగా మనదేశంలో పెళ్లి అయిన వారు ఒకవేళ అవాంచిత గర్భాన్ని ధరించినట్లయితే.. భర్త, ఇతర కుటుంబ సభ్యుల అనుమతితో వైద్యులు అబార్షన్ చేస్తారు.