close
Choose your channels

‘‘ఆచార్య’’లో మరో సర్‌ప్రైజ్ : గెస్ట్‌ రోల్‌లో సత్యదేవ్.. ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ చిరు ట్వీట్

Thursday, April 28, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కృషి , పట్టుదల, శ్రమించేతత్వం వుంటే ఏ గాడ్ ఫాదర్ లేకపోయినా అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చని నిరూపించారు మెగాస్టార్ చిరంజీవి. స్వయంకృషితో తెలుగు సినీ ప్రపంచాన్ని మకుటం లేని మహారాజులా శాసించారు. ఆయన స్పూర్తితో ఎంతోమంది నటీనటులు, టెక్నీషియన్లు వెండి తెరవైపు అడుగులు వేశారు.

ఇక అసలు విషయంలోకి వెళితే.. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘ఆచార్య’ మరికొద్దిగంటల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. కెరీర్‌లో పరాజయం ఎరుగని కొరటాల దర్శకత్వంలో చిరు నటించిన సినిమా కావడంతో ‘‘ఆచార్య’’పై భారీ అంచనాలు వున్నాయి. ఇందులో సిద్ధ పాత్రలో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. సినిమా ప్రారంభానికి ముందు సూపర్‌స్టార్ మహేశ్ వాయిస్ ఓవర్ వుండటం దీనికి అదనపు ఆకర్షణ కానుంది. ఇంతటి క్రేజీ ప్రాజెక్ట్‌లో టాలెంటెట్ నటుడు సత్యదేవ్ కూడా నటించారట. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి తెలియజేశారు.

డియర్ సత్యదేవ్..థాంక్యూ. నీలాంటి చక్కని నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషం..’ఆచార్య’ లో తక్కువ నిడివి పాత్రలో అయినా నువ్వు కనిపించడం నాకు ఆనందం..’గాడ్ ఫాదర్’ సినిమాలో నా అభిమాని నాకు ఎదురు నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నటించడం నాకు గర్వకారణం..సో ప్రౌడ్ ఆఫ్ యు. గాడ్ బ్లెస్!” అంటూ చిరు ట్వీట్ చేశారు. చిరు ట్వీట్ పై సత్యదేవ్ స్పందిస్తూ… “అన్నయ్యా, నటనలో జీవితంలో మాలాంటి ఎందరికో ఆచార్య మీరు. అభిమానిగా గుండెల్లో చిరకాలం తలిచేది మీ పేరునే. మిమ్మల్ని చూసే నటుడిగా మారాను. ఈరోజు ఆచార్య సినిమాలో కాసేపైనా మీతోపాటూ కనిపించే అదృష్టం కలిగింది. మీ కష్టం, క్రమశిక్షణ దగ్గర నుంచి చూసి నేర్చుకునే అవకాశం దక్కింది.’లవ్ యు ఫరెవర్’ అంటూ సత్యదేవ్ రాసుకొచ్చారు.

మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మించిన ఆచార్యలో కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రామ్‌చరణ్, పూజాహెగ్డే, సోనూసూద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్ప‌టికే ఆచార్య నుంచి విడుద‌లైన 'లాహె లాహె', 'నీలాంబ‌రీ' ‘శానా కష్టం’ పాటలు ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అల‌రించాయి. ఇక చిరంజీవి వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన రాజా దర్శకత్వంలో గాడ్‌ఫాదర్‌తో పాటు మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్, బాబీ డైరెక్షన్‌లో ‘‘వాల్తేర్ వీరయ్య’’, వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు మెగాస్టార్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.