World Soil Day: హైదరాబాద్ లో వివిధ లొకేషన్లలో మట్టిని రక్షించు అవగాహన కార్యక్రమం

  • IndiaGlitz, [Monday,December 05 2022]

వందల మంది మట్టిని రక్షించు ఉద్యమం వాలంటీర్లు ఇంకా కాలేజీ విద్యార్థులు శిల్పారామం, కూకట్ పల్లి, ట్యాంక్ బండ్, అమీర్ పేట్, ప్యారడైజ్, కొత్తపేట్, తార్నాక మొదలగు ప్రదేశాలలో ఉ. 8 నుండి 9 గం.ల వరకు పలుచోట్ల నిలబడి, నడస్తు, సైకిల్ నడుపుతూ, స్టిక్కర్లు పంచుతూ వివిధ రకాలుగా మట్టి క్షీణత గురించి అవగాహన కల్పించడానికి ముందుకొచ్చారు.

మట్టే సమస్త జీవకోటికి ఆధారం, కాబట్టి వ్యవసాయ భూముల్లో కనీసం 3-6% సేంద్రీయ పదార్ధం ఉండేలా చట్టాలు రూపొందించమని, ప్రపంచ దేశాలను కోరుతూ జరిగిన, ఇంకా జరుగుతున్న ప్రపంచవ్యాప్త పర్యావరణ ఉద్యమం ఇది. దీని కోసం సద్గురు ప్రపంచవ్యాప్తంగా 100-రోజులు, 30,000 కిలోమీటర్లు, ఏకధాటిగా 27 దేశాల గుండా ఒంటరిగా మోటార్‌సైకిల్ పైన ప్రయాణం చేశారు.

పిల్లలు చేసిన కళాకృతులు ఎంతో అద్బుతంగా ఉన్నాయి అని ఈ కార్యక్రమంలో అందరికీ స్టిక్కర్లు పంచిన రాజ్ కిరణ్ అన్నారు.

వివిధ ప్రాంతాల్లో దాదాపు 500 విద్యార్థులు పాల్గొని, 16000కు స్టిక్కర్లు పంచిపెట్టడం జరిగింది.

ఈరోజు తెల్లవారుజామున, మట్టిని రక్షించు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సద్గురు ప్రపంచ #ScoreforSoil ప్రచారాన్ని ప్రారంభించారు. ఫుట్‌బాల్ ప్రపంచ కప్ నేపథ్యంలో మట్టిని రక్షించు ఉద్యమానికి మద్దతుగా వారి అత్యుత్తమ ఫుట్‌బాల్ షాట్ మరియు #ScoreForSoil వీడియోను సోషల్ మీడియాలో ఉంచమని ప్రజలను ప్రోత్సహిస్తున్నారు.

ఈ ఉద్యమం యొక్క సందేశాన్ని విస్తృతం చేయడానికి ప్రపంచ మట్టి దినోత్సవం రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఒకచోట చేరడంతో మట్టిని రక్షించు ఉద్యమానికి మద్దతు వెల్లువెత్తుతోంది.

ఈశా యోగా సెంటర్ కోయంబత్తూరులో, డిసెంబర్ 5వ తేదీ వరకు 60,000 కంటే ఎక్కువ కార్లు మరియు ద్విచక్ర వాహనాల స్టిక్కర్లు పంపిణీ చేయబడ్డాయి. ఆశ్రమం వెల్కమ్ పాయింట్ వద్ద, ఆదియోగి వద్ద ఈశా వాలంటీర్లు మరియు విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో కనిపించారు. ప్రపంచ మట్టి సంక్షోభం గురించి సందర్శకులకు వివరించడంలో ఆశ్రమవాసులందరూ పాల్గొన్నారు. ప్రపంచ మట్టి దినోత్సవం తర్వాత వారంలో ‘సేవ్ సాయిల్’ ప్రచారంతో ఆశ్రమం అంత సందడి గానుంది.

తక్కువ వ్యవధిలో ఉద్యమం 3.91 బిలియన్లకు పైగా ప్రజలను చేరుకోవడంతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. 81 దేశాలు మట్టి అనుకూల విధానాలను రూపొందించడానికి కట్టుబడి ఉన్నాయి.

More News

Aha Naa Pellanta: 75 మిలియ‌న్స్ వ్యూయింగ్ మినిట్స్ సాధించిన ‘అహ నా పెళ్ళంట’

వైవిధ్య‌మైన కంటెంట్‌ను అందిస్తున్న వ‌న్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ 5 నుంచి రీసెంట్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఒరిజిన‌ల్ ‘అహ నా పెళ్లంట’.

SS RajaMouli : అందుకే మహేశ్‌ను సెలక్ట్ చేసుకున్నాడు.. కథేంటంటే : విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్

ఆర్ఆర్ఆర్ బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఏ సినిమా తీయబోతున్నాడంటూ టాలీవుడ్‌తో

Bandla Ganesh: హాట్ టాపిక్ గా మారిన బన్నీపై బండ్ల గణేష్ కామెంట్స్

వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తారు సినీనటుడు, నిర్మాత బండ్ల గణేష్. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబంపై ఆయన ఈగ వాలనివ్వరు.

BiggBoss: ఫైమా ఎలిమినేషన్.. చేతిపై ముద్దుపెట్టిన నాగ్, నవ్వుతూ బయటకు

బిగ్‌బాస్ 6 తెలుగులో మరోసారి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యింది. టాప్ 5లో ఖచ్చితంగా వుంటుందనుకున్న జబర్దస్త్ ఫైమా కన్నీటితో హౌస్‌ను వీడింది.

A Journey to Kashi: 'ఏ జర్నీ టు కాశీ' ట్రైలర్ విడుదల

వారణాసి క్రియేషన్స్ పతాకం పై చైతన్య రావు, అలెగ్జాండర్ సాల్నికోవ్ , ప్రియా పాల్వాయి, ఖ్యాతిలీన్  గౌడ ముఖ్య తారాగణం తో