close
Choose your channels

'సావిత్రి w/o సత్యమూర్తి' టీజర్ విడుదల

Wednesday, August 18, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

'దిస్ ఈజ్ సత్యం. క్లాస్ టచ్, మాస్ కటౌట్! ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకడు నాలాంటోడు' అని 'కేరింత' ఫేమ్ పార్వతీశం అంటున్నారు. రెండు పదుల వయసున్న యువకుడిగా, సత్యమూర్తి పాత్రలో ఆయన నటించిన సినిమా 'సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి'. అరవైయేళ్ల మహిళగా, ఆయన భార్య పాత్రలో ప్రముఖ హాస్యనటి శ్రీలక్ష్మి నటించారు. ఏ1 మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాతో పూరి జగన్నాథ్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన చైతన్య కొండ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని బుధవారం సినిమా టీజర్ విడుదల చేశారు.

'భూమి పుట్టకముందు పుట్టాడు. అయినా ముసలోడు అవ్వలేదు. ఇంకా కుర్రాడిలా ఉన్నాడు' అని ఓ వ్యక్తి... 'అసలు నువ్వు తండ్రిలా ఉన్నావా? తమ్ముడిలా ఉన్నావ్! కొన్నాళ్లు పోతే కొడుకులా ఉంటావ్' అని పార్వతీశంపై సుమన్ శెట్టి విరుచుకుపడటం... 'సత్యమూర్తికి 1980లో పెళ్లైంది. సత్యం ఇలా ఉండటానికి ఏదో రీజన్ ఉంది' అని న్యూస్ ప్రజెంటర్ చెప్పడం... 'నీ సీక్రెట్ ఏంటో నాకు తెలిసేంత వరకూ ఈ సింహం నిద్రపోదు. నిద్రపోనివ్వను' అని హాస్యనటుడు గౌతమ్ రాజు అనడం... ఇవన్నీ చూస్తుంటే, హీరోకి ఎంత వయసు వచ్చినా యువకుడిలా ఉంటున్నాడనే సంగతి అర్థం అవుతోంది. అయితే, అతడు యువకుడిలా ఉండటానికి గల రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాలని దర్శకుడు చైతన్య కొండ చెబుతున్నారు.

నిర్మాత గోగుల నరేంద్ర మాట్లాడుతూ "గోపీచంద్ మలినేనిగారు టీజర్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకు థాంక్స్. సినిమా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం. పార్వతీశం, శ్రీలక్ష్మిగారి జంట నవ్వులు పూయిస్తుంది. అన్ని వర్గాలను, అన్ని వయసుల వాళ్లను అలరించే చిత్రమిది" అని అన్నారు.

దర్శకుడు చైతన్య కొండ మాట్లాడుతూ "స్వచ్ఛమైన కుటుంబకథా చిత్రమిది. చాలా రోజుల తర్వాత ఇటువంటి వినోదాత్మక సినిమా వస్తోంది. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరి సహకారంతో సినిమా అద్భుతంగా వచ్చింది. సినిమాలో మొత్తం మూడు పాటలు ఉన్నాయి. సత్య కశ్యప్ చక్కటి బాణీలు ఇచ్చారు. త్వరలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటల్ని విడుదల చేస్తాం" అని అన్నారు.

శివారెడ్డి, సుమన్ శెట్టి, గౌతంరాజు, అనంత్, జెన్ని, సుబ్బరాయశర్మ, కోట శంకరావు, పద్మజయంతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), డిజిటల్ మీడియా - విష్ణు తేజ పుట్ట, ప్రొడక్షన్ కంట్రోలర్: కె. ఎల్లారెడ్డి, ఎడిటర్: మహేష్, నేపథ్య సంగీతం: మహిత్ నారాయణ, స్వరాలు: సత్య కశ్యప్, సినిమాటోగ్రఫీ: ఆనంద్ డోల, ప్రొడ్యూసర్: గోగుల నరేంద్ర, కథ - డైలాగ్స్ - స్క్రీన్ ప్లే - డైరెక్షన్: చైతన్య కొండ.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.