అభిమ‌న్యుడు కాదు.. అర్జునుడు

  • IndiaGlitz, [Wednesday,October 24 2018]

నాగ‌చైత‌న్య హీరోగా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'స‌వ్య‌సాచి'. నవంబ‌ర్ 2న విడుద‌ల‌వుతున్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను నేడు విడుద‌ల చేశారు. హీరో ఎడ‌మ‌చేయి అసంక‌ల్పితంగా ప‌ని చేస్తుంటే ఎలా ఉంటుంది?  అస‌లు హీరో ఎడ‌మ చేయి అలా ప‌నిచేయ‌డానికి ఏదైనా కార‌ణం ఉందా? అని తెలుసుకోవాలంటే స‌వ్య‌సాచి సినిమా చూడాల్సిందే.

ట్రైల‌ర్ చూస్తే.. టీజ‌ర్‌లో చూపించిన  ఎడ‌మ చేయి వాటం అనే కాన్సెప్ట్‌ను ఇంకాస్త ఎస్టాబ్లిష్ చేశారు. దీంతో పాటు మాధ‌వ‌న్ విల‌నిజాన్ని మ‌రో కోణంలో ఎలివేట్ చేశారు. నిధి అగ‌ర్వాల్ గ్లామ‌ర్ ఎక్స్‌ట్రా ఎసెట్ అయ్యేలా ఉంది. నిధితో ల‌వ్ పార్ట్‌లో హీరో ఎడ‌మ‌చేయి ఏం చేసింద‌నే విష‌యాన్ని కామెడీ ట‌చ్‌లో కాస్త చూపించారు.

ప్రేమ.. కోపంలాంటి భావోద్వేగాలు మీకొస్తే మీరు మాత్రమే రియాక్ట్‌ అవుతారు. అదే నాకొస్తే నాతో పాటు ఇంకొకడు కూడా రియాక్ట్‌ అవుతాడు. వాడే నా ఎడమ చెయ్యి...అని చైత‌న్య చెప్పే డైలాగ్‌

వీడ్ని చూస్తుంటే పద్మవ్యూహంలో పడిపోయిన అభిమన్యుడులా ఉన్నాడ‌ని విల‌న్ మాధ‌వ‌న్ అంటే ప‌క్క‌నున్న తాగుబోతు ర‌మేశ్ మీరన్న‌ది క‌రెక్టే సార్‌..కానీ అభిమన్యుడిలా కాదు సార్‌.. అర్జునుడిలా..

చావైనా నిన్ను చేరాలంటే నీ ఎడ‌మ చేయిని దాటాలి అని రావు ర‌మేశ్ చైత‌న్య‌తో చెప్పే డైలాగ్‌.. యాక్ష‌న్ సీన్స్ అన్ని హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ను ఎలివేట్ చేస్తున్నాయి. 

More News

'హావా' కాన్సెప్ట్ పోస్ట‌ర్  విడుద‌ల చేసిన డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల‌

క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వ‌స్తున్న హావా మూవీ టాలీవుడ్ ప్ర‌ముఖుల మెప్పు పొందుతుంది.

'సవ్యసాచి' మూవీ ట్రైలర్ లంచ్ వేడుక..

అక్కినేని నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న సినిమా ' సవ్యసాచి'..  నిధి అగర్వాల్ కథానాయిక.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు..

రథం ప్రీ రిలీజ్ ఈవెంట్..  

ఎ.వినోద్ సమర్పణలో  రాజా దరపునేని నిర్మిస్తున్న చిత్రం రథం. గీతానంద్, చాందిని భగవాని హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి చంద్ర శేఖర్ కనూరి.

సర్కార్‌ సంభాషణలకు రెస్పాన్స్‌ అదిరిపోతుంది: నిర్మాత

అతనొక కార్పొరేట్‌ మోన్స్టర్. అతను ఏ దేశం వెళ్లినా అక్కడ ఎదిరించిన వాళ్ళను అంతం చేస్తాడు. ఎలక్షన్ల కోసం ఇప్పుడతను ఇండియాకి వచ్చాడు.

 నవంబర్ 16న రానున్న'హుషారు'

'టాటా బిర్లా మధ్యలో లైలా' చిత్రంతో నిర్మాతగా తన ప్రస్థానం ప్రారంభించిన లక్కీ మీడియా సంస్థ అధినేత బెక్కెం  వేణుగోపాల్ ' మేము వయసుకు వచ్చాం'