సాహ‌సం శ్వాస‌గా సాగిపో అంటూ చైతు వ‌చ్చేస్తున్నాడు..

  • IndiaGlitz, [Tuesday,July 19 2016]

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం సాహ‌సం శ్వాస‌గా సాగిపో. తెలుగు, త‌మిళ్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్ అందిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన సాహ‌సం శ్వాస‌గా సాగిపో ఆడియోకు మంచి రెస్పాన్స్ ల‌భిస్తుంది. ఇక సినిమా రిలీజ్ విష‌యానికి వ‌స్తే...ఈనెల 15న రిలీజ్ చేయాల‌నుకున్నారు. అయితే ఆ డేట్ కి క‌బాలి రిలీజ్ చేయాల‌నుకోవ‌డంతో సాహ‌సం శ్వాస‌గా సాగిపో వాయిదా ప‌డింది.

క‌బాలి ఈ నెల 22న రిలీజ్ అవుతుండ‌డంతో సాహ‌సం శ్వాస‌గా సాగిపో రిలీజ్ పై క్లారిటీ వ‌చ్చింది. ఈ విష‌యం పై చిత్ర స‌మ‌ర్ప‌కుడు కోన వెంక‌ట్ ట్విట్ట‌ర్లో స్పందిస్తూ...సాహ‌సం శ్వాస‌గా సాగిపో ఆగ‌ష్టులో రిలీజ్ చేస్తున్నాం. గౌత‌మ్ మీన‌న్ ఇప్పుడే క‌న్ ఫ‌ర్మ్ చేసారు. ఆగ‌ష్టు నెల‌లో ఏ తారీఖున రిలీజ్ అనేది రెండు రోజుల్లో ఎనౌన్స్ చేస్తాం అని తెలియ‌చేసారు. సో... సాహ‌సం శ్వాస‌గా సాగిపో అంటూ చైతు కూడా ఆగ‌ష్టులో వ‌చ్చేస్తున్నాడు.