గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ..

  • IndiaGlitz, [Friday,January 08 2021]

ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్‌ను అందించింది. గృహ కొనుగోలు దారులకు సంక్రాంతికి ముందే పండుగ కానుకను అందించింది. గృహ రుణాల వడ్డీ రేటుపై 30 బేసిన్ పాయింట్ల మేర రాయితీని ఇవ్వడమే కాకుండా.. 100 శాతం ప్రాసెసింగ్ ఫీజును మినహాయించింది. అయితే ఇదంతా సిబిల్ స్కోర్ ఆధారంగా మాత్రమే వర్తిస్తుంది. కాగా.. రూ.30 లక్షల వరకూ గృహ రుణాలపై ప్రారంభ వడ్డీ రేటును 6.80 శాతానికి.. అంతకు మించి ఉన్న రుణాలపై 6.95 శాతంగా నిర్ధారించినట్టు ఎస్‌బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఇక మహిళా కొనుగోలుదారులైతే 5 బేసిన్ పాయింట్ల రాయితీ ఇవ్వనున్నట్టు ఎస్‌బీఐ వెల్లడించింది. రూ. 5 కోట్ల వరకు రుణాలపై 30 బేసిస్ పాయింట్ల రాయితీ దేశంలోని ఎనిమిది మెట్రో నగరాల్లో అందుబాటులో ఉంటుందని భారతీయ స్టేట్ బ్యాంకు తెలిపింది. రాయితీలను మెరుగుపరిచినందుకు ఎస్‌బీఐ సంతోషం వ్యక్తం చేసింది. వడ్డీ రుణాలపై పెద్ద మొత్తంలో రాయితీలు ప్రకటించడంతో ఇళ్ల కొనుగోలుకు మరింత మంది ఆసక్తి చూపిస్తారని ఎస్‌బీఐ ఎండీ (రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ శెట్టి తెలిపారు. ఎస్‌బీఐ ఇచ్చిన రాయితీతో సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే వారికి మంచి అవకాశం కలిగినట్టైంది.

More News

పుట్టింట్లో మరోమారు కల్లోలం రేపుతున్న కరోనా మహమ్మారి..

కరోనా మహమ్మారి తన పుట్టింట్లో మరోమారు కల్లోలం రేపుతోంది. 2019లో వూహాన్‌లో పుట్టిన ఈ మహమ్మారిని ఆ దేశస్తులు త్వరగానే వదిలించుకున్నారు.

'మాస్టర్‌' అన్నీ వర్గాలను మెప్పించే ఫీస్ట్‌లా ఉంటుంది - డైరెక్టర్‌ లోకేశ్‌ కనకరాజ్‌

దళపతి విజయ్‌ కథానాయకుడిగా నగరం, ఖైది చిత్రాలతో సెన్సేషల్‌ హిట్స్‌ సాధించిన డైరెక్టర్‌ లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో

వాట్సప్‌పై ఎందుకింత చర్చ? కొత్త ప్రైవసీ రూల్స్‌లో ఏముంది?

దేశవ్యాప్తంగా వాట్సప్ ప్రైవసీ రూల్స్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా ఇదే అంశం ట్రెండింగ్‌లో ఉంది.

అధీర పాత్ర కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది: సంజయ్ దత్

హీరో యశ్ బర్త్‌డే సందర్భంగా ‘కేజీఎఫ్ 2’ టీజర్ విడుదలై దుమ్ము రేపుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ముఖ్యంగా హైలైట్ అవుతోంది..

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘కేజీఎఫ్ 2’ టీజర్..

కన్నడలో తెరకెక్కి అనూహ్య విజయం సాధించిన కేజీఎఫ్ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రం ‘కేజీఎఫ్-2’.