close
Choose your channels

ప్ర‌బాస్ భామ ఫొటో షూట్‌కు ఒళ్లంతా కళ్లు చేసుకోవలసిందేనా.!

Wednesday, January 8, 2020 • తెలుగు Comments

ప్ర‌బాస్ భామ ఫొటో షూట్‌కు ఒళ్లంతా కళ్లు చేసుకోవలసిందేనా.!

అందాల ఆరబోతలో ముందుండే స్కార్లెట్ మెలిష్ విల్సన్.. తాజాగా కళ్లు చెదిరే పిక్స్‌తో కుర్రకారు మతులు పోగొడుతోంది. మనోహరి పాట గుర్తుందిగా.. బాహుబలిలో సందడి చేసిందే ఆమే.. ఈ సుందరి. ‘ఒళ్లంతా తుళ్లింత.. ఈ వింతలేలా’ అంటూ ప్రభాస్ ఆడిపాడుతుంటే.. తన అందంతో మత్తెక్కించిన సుందరి ఈ మనోహరి. ‘బాహుబలి’, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’, ‘ఎవడు’ సినిమాలతో టాలీవుడ్‌‌లో గుర్తింపు పొందిన ఈ ఐటెం గర్ల్.. టాప్ లెస్ ఫొటోలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఓ మ్యాగజైన్ కోసం ఇలా పిచ్చెక్కించే అందాలతో కనువిందు చేసింది ఈ ముద్దుగమ్మ. కౌస్తుభ్ అనే ఫొటోగ్రాఫర్.. ఈ స్టిల్స్‌ను షూట్ చేశాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. నెటిజన్లు విరగబడి మరీ చూస్తున్నారు.

ప్ర‌బాస్ భామ ఫొటో షూట్‌కు ఒళ్లంతా కళ్లు చేసుకోవలసిందేనా.!

ఐటెం సాంగ్స్‌తో తన ప్రస్థానాన్ని కొనసాగించిన ఈ లండన్ భామ.. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులేవీ లేకపోవడంతో ఇలా బోల్డ్‌గా కనిపిస్తుందని నెటిజన్లు అంటున్నారు. అందాల ఆరబోతతో అవకాశాలు దక్కించుకునేందుకు ఆపసోపాలు పడుతోందని కామెంట్స్ చేస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz