close
Choose your channels

ఎఫ్ 3 స్క్రిప్ట్ పూర్తి ...

Wednesday, May 6, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎఫ్ 3  స్క్రిప్ట్ పూర్తి ...

గ‌త ఏడాది ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ఎఫ్ 2`. వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్, త‌మ‌న్నా, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్ర‌మిది. గ‌త సంక్రాంతి విన్న‌ర్‌గా నిలిచిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ఎఫ్‌3ని తెర‌కెక్కిస్తామ‌ని ద‌ర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్‌రాజు తెలియ‌జేసిన సంగతి తెలిసిందే. అయితే త‌ర్వాత అనిల్ రావిపూడికి సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌ను డైరెక్ట్ చేసే అవ‌కాశం ద‌క్కింది. ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి మ‌హేశ్‌తో చేసిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమా కూడా విజ‌యం సాధించింది. ఈనేప‌థ్యంలో సీక్వెల్ ఎఫ్ 3 మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది.

సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 స్క్రిప్ట్‌ను పూర్తి చేశాడు. క‌రోనా ప్ర‌భావంతో కావాల్సినంత గ్యాప్ దొర‌క‌డంతో అనీల్ స్క్రిప్ట్‌ను పూర‌త్తి చేసేశాడు. ఇందులో మ‌రో హీరో న‌టించే అవ‌కాశం ఉంటుంద‌ని అది ఇప్పుడే చెప్పలేన‌ని చెప్పిన అనీల్ రావిపూడి మ‌రో స్టార్ హీరోను ఇందులో న‌టింప చేస్తాడో లేదో చూడాలి. ఎఫ్ 3 లో మ‌హేశ్ న‌టిస్తాడ‌ని, ర‌వితేజ నటిస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి. ఒక‌వేళ నిజంగానే మ‌రో స్టార్ న‌టించే అవ‌కాశం ఉంటే ఎవ‌రు న‌టిస్తార‌నే ఆస‌క్తిక‌రంగా మారింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.