close
Choose your channels

రీమేక్‌లో నాగ్‌... యంగ్ డైరెక్ట‌ర్ కోసం అన్వేష‌ణ‌!!

Tuesday, July 21, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రీమేక్‌లో నాగ్‌... యంగ్ డైరెక్ట‌ర్ కోసం అన్వేష‌ణ‌!!

కింగ్ నాగార్జున గ‌త ఏడాది `మ‌న్మ‌థుడు 2`తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అయితే ఈ సినిమా ప్లాప్ అయ్యింది. అయితే నాగార్జున మ‌రో సినిమాకు క‌మిట్ కాలేదు. సాల్మోన్ ద‌ర్శ‌క‌త్వంలో ‘వైల్డ్ డాగ్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ క‌రోనా ఎఫెక్ట్ వ‌ల్ల ఆగింది. దీని త‌ర్వాత ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలోనూ నాగార్జున ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌లోనూ న‌టించ‌నున్నారు. ఇది కాకుండా ఓ బాలీవుడ్ రీమేక్‌లో న‌టించ‌డానికి నాగార్జున ఆస‌క్తిగా ఉన్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. వివ‌రాల్లోకెళ్తే.. అజ‌య్ దేవ‌గ‌ణ్ హీరోగా న‌టించిన బాలీవుడ్ చిత్రం `రైడ్‌`. ఈ సినిమా తెలుగు రీమేక్‌లో నాగార్జున న‌టించాల‌నుకుంటున్నార‌ట‌. అయితే అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కుల‌తో కాకుండా యంగ్ డైరెక్ట‌ర్స్‌తో ఈ రీమేక్ చేయాల‌ని నాగార్జున యోచిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం నాగ్ ద‌ర్శ‌కుల వేట‌లో బిజీగా ఉన్నారు.

ఇవ‌న్నీ కాకుండా.. నాగార్జున త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోయే తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4కు వ్యాఖ్యాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. బిగ్‌బాస్ 4 త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన లోగో కూడా విడుద‌లైంది కానీ.. నాగార్జున హోస్టింగ్ గురించి మాత్రం క్లారిటీ రాలేదు. త్వ‌ర‌లోనే ఆ విష‌యంపై కూడా క్లారిటీ వ‌చ్చేస్తుంది. బిగ్‌బాస్ 4తో పాటు సినిమాల‌పై కూడా నాగార్జున ఫోకస్ చేయనున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.