పవన్ చేతిపై టాటూ.. అసలు సీక్రెట్ ఇదేనట..

  • IndiaGlitz, [Wednesday,April 21 2021]

ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడంలేదు. మూడేళ్ల పాటు సినిమాలకు పవన్ ఎప్పుడు ఓకే చెబుతారా? అని ఎదురు చూసిన దర్శక నిర్మాతలు ఇప్పుడు ఆయనకు తమ కథ చెప్పి ఒప్పించి పనిలో పడిపోయారు. పవన్ కూడా కరోనా కారణంగా కాస్త గ్యాప్ వచ్చింది కానీ మహమ్మారి నుంచి కోలుకోగానే తిరిగి తన జోరును కొనసాగించనున్నారు. ఇటు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇప్పటికే పవన్ నటించిన ‘వకీల్‌సాబ్’ మూవీ రిలీజై మంచి సక్సెస్ టాక్‌తో నడుస్తుండగా.. ఇంకా ఆయన ఊహించని విధంగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఉన్నారు.

ఇటీవలే హరీశ్ శంకర్‌తో కూడా సినిమా అనౌన్స్ అయ్యింది. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో మూవీ ఉండనున్నట్లు తెలుస్తోంది. తాజాగా పవన్ చేతిపై ఒక టాటూ కనిపిస్తోంది. నిజానికి ఆయన టాటూ వేయించుకోవడం అభిమానులు ఎప్పుడూ చూడలేదు. దీంతో ఈ టాటూ తెగ వైరల్ అవుతోంది. చేతిపై త్రిశూలం టాటూ అయితే కనిపిస్తోంది. ఈ టాటూ వెనుక అసలు సీక్రెట్ ఏంటంటే.. పవన్ ‘హరిహర వీరమల్లు’ చిత్రం కోసం ఈ టాటూ వేయించుకున్నారట. మొగలుల కాలంలో బందిపోట్లు ఇలాంటి పచ్చబొట్లు వేసుకునేవారని.. పవన్ చేస్తున్నది ఆ కాలం నాటి దొంగ పాత్ర అవడంతో పాత్రకు తగ్గట్టుగా టాటూని వేయించుకున్నారని సమాచారం.

ప్రముఖ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీ కోసం పవన్ టెంపరరీ త్రిశూలం టాటూ వేయించుకున్నారట. 18వ శతాబ్దం నాటి మొఘల్‌ పాలన నేపథ్యంలో ఈ మూవీ కథాశం తిరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాను తెలంగాణ రాబిన్ హుడ్‌గా పేరొందిన పండుగ సాయన్న జీవితగాథ ఆధారంగా తెరకెక్కిస్తున్నాని సమాచారం. పవన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

More News

షూటింగ్‌లపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆంక్షలు

కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున సినిమా షూటింగ్‌లపై కూడా ఆంక్షలు విధిస్తూ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక ప్రకటన విడుదల చేసింది.

సినీ పరిశ్రమ, జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పిన చిరు

మెగాస్టార్ చిరంజీవి సినీ కార్మికులకు, సినీ జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పారు.

4 రాష్ట్రాల సీఎంలు సహా కరోనాకు చిక్కిన బడా నేతలు

భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విధ్వంసం సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ పోతోంది.

తెలంగాణలో రేపటి నుంచి థియేటర్లు బంద్..

తెలంగాణలో రేపటి నుంచి థియేటర్లు బంద్ కానున్నాయి. కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న క్రమంలో తెలంగాణ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది.

‘పింక్ వాట్సాప్’తో జాగ్రత్త..

ఇంటర్నెట్ బాగా డెవలప్ అయ్యాక.. ప్రజానీకానికి పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చాక ఏం చేయాలన్నా ఒక్క క్షణం ఆలోచించి చేయాల్సిందే.