మరో ఛాన్స్ కొట్టేసిన సీరత్

  • IndiaGlitz, [Friday,December 29 2017]

రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాల బాట పట్టింది 'ర‌న్ రాజా ర‌న్' ఫేమ్‌ సీరత్ కపూర్. నాగార్జున నటించిన రాజు గారి గది2' సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ‌.. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది. గురువారం విడుదలైన ఒక్క క్షణం' సినిమాలో స్వాతిగా న‌ట‌న‌కు అవ‌కాశ‌మున్న పాత్ర‌లో క‌నిపించిన సీర‌త్‌.. త‌న పెర్‌ఫార్మెన్స్‌తో అంద‌రినీ అల‌రిస్తోంది.

ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు.. మాస్ మ‌హారాజ్‌ రవితేజ హీరోగా తెరకెక్కుతున్నటచ్ చేసి చూడు'లో ఇద్ద‌రు హీరోయిన్‌ల‌లో ఒక‌రిగా నటిస్తోంది. అలాగే రవికాంత్ పెరేపు డైరెక్ట్ చేస్తున్న సినిమాలో కూడా సీర‌త్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. వీటితో పాటు పూల రంగడు', లౌక్యం' వంటి సూపర్ హిట్ సినిమాల రచయిత శ్రీధర్ సీపాన.. మొదటిసారిగా మెగాఫోన్ పట్టుకుంటున్న చిత్రంలో కూడా న‌టించే ఛాన్స్ కొట్టేసింది సీరత్. కామిక్ డ్రామాగా రూపొందించబోయే ఈ మూవీకి సీరత్ పాత్రే కీల‌క‌మ‌ని తెలిసింది. చూస్తుంటే.. సీర‌త్ హ‌వా వ‌చ్చే ఏడాది బాగానే కొన‌సాగేట‌ట్లుంది.

More News

రామ్ చ‌ర‌ణ్ మ‌రోసారి..

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రంగ‌స్థ‌లంతో బిజీగా ఉన్నారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం మార్చి 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ  సినిమా త‌రువాత బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నారు చ‌ర‌ణ్‌. జ‌న‌వ‌రి నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంది.

నాగ చైతన్య 'ధర్మాభాయ్'?

పెళ్లి తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్పీడ్ పెంచారు అక్కినేని నాగ చైతన్య.

'హలో...' వంటి ఫీల్ గుడ్ మూవీ నా యాభైవ చిత్రం కావడం చాలా హ్యాపీగా వుంది - అనూప్ రూబెన్స్

'జై'చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం అయి అనతికాలంలోనే 50 చిత్రాలకు మ్యూజిక్ చేసిన అనూప్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అంచెలంచెలుగా ఎదుగుతూ మ్యూజిక్ డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నారు

మ‌హేష్ 25 దీపావ‌ళికి రానుందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న‌ 24వ చిత్రం 'భరత్ అనే నేను'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో కైరా అద్వాని కథానాయికగా న‌టిస్తోంది.

చిరు పాట‌.. మ‌రోసారి రీమిక్స్‌

మెగాహీరో సాయిధరమ్‌ తేజ్.. ప్రతి సినిమాకి ఒకేలా కష్టపడే హీరో. ఈ యువ క‌థానాయ‌కుడు న‌టించ‌గా ఈ సంవత్సరం విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత విజయం సాధించలేకపోయాయి.