ర‌వితేజ‌ని టీజ్ చేసిన ముద్దుగుమ్మ‌

  • IndiaGlitz, [Sunday,January 28 2018]

'రన్ రాజా రన్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక సీరత్ కపూర్. గ‌తేడాది నాగార్జున, స‌మంత న‌టించిన‌ 'రాజుగారి గది2'లో ఓ కీల‌క పాత్ర‌లో కనిపించింది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా వి.ఐ.ఆనంద్ డైరెక్షన్‌లో తెరకెక్కిన 'ఒక్క క్షణం'లో కూడా న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌లో మెరిసింది సీర‌త్‌. త్వ‌ర‌లోనే.. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన 'టచ్ చేసి చూడు'లో ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌లో ఒక‌రిగా సంద‌డి చేయ‌బోతోంది.

ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ, "ఈ చిత్రంలో నాది స‌ర‌దాగా సాగే పాత్ర. ర‌వితేజ సినిమాలను గ‌మ‌నిస్తే.. హీరోయిన్ల‌ను ఆయ‌న టీజ్ చేసే సంద‌ర్భాలు ఎక్కువ‌గా ఉంటుంటాయి. అయితే.. ఇందులో మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. నేనే రివ‌ర్స్‌లో ర‌వితేజ‌ని టీజ్ చేస్తుంటాను. అంతేగాకుండా.. రవితేజను అది చెయ్, ఇది చేయ్‌, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అంటూ బాగా డామినేట్‌ చేసి ఇబ్బంది పెట్టేస్తుంటాను.

ఇక ఆయనతో కలిసి పని చేయడం ఒక ఫన్ రైడ్ లాంటిది. పేరుకే సీనియర్ హీరో కాని...అందరితో చ‌క్క‌గా కలిసిపోతారు. పని విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఇక ఈ సినిమాలో మాపై చిత్రీకరించిన ఒకే ఒక మాస్ సాంగ్‌కి నేను, రవితేజ కలిసి మాస్ స్టెప్పులేసాము. ఈ పాట అందరికి నచ్చుతుంది" అని ముక్తాయించింది సీరత్.

డెబ్యు డైరెక్టర్ విక్రమ్ సిరికొండ తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది.

More News

'మన్మథుడు'ని ఫాలో అయిపోతున్నదేవిశ్రీ‌

కెరీర్‌లో స్థిర‌ప‌డిన ప్ర‌తి ఒక్కరికీ.. తల్లిదండ్రులతో స‌హా ప్ర‌తి ఒక్క‌రి నుంచి ఎదుర‌య్యే ప్ర‌శ్న‌ 'పెళ్లి ఎప్పుడు?' అనేదే. ఇందుకు టాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్ కూడా మిన‌హాయింపు కాదు. ఇప్పుడు త‌ను ఎక్కడికెళ్ళినా ఈ ప్ర‌శ్న‌ పదేపదే ఎదుర‌వుతుందంటున్నాడు ఈ రాక్ స్టార్‌. అంతేగాకుండా, "పెళ్ళంటే నూరేళ

నాని కోసం క‌థ రెడీ చేస్తున్నాడ‌ట‌

'అష్టా చమ్మా' సినిమాతో తెలుగు తెరకు క‌థానాయ‌కులుగా పరిచయమయ్యారు నాని, అవసరాల శ్రీనివాస్. ఇద్దరూ ఒకేలా కష్టపడుతూ.. ఎవరికిష్టమైన వృత్తిలో వారు పేరుని సంపాదించుకుంటున్నారు.  ఈ సినిమా తర్వాత నాని క్ర‌మంగా నేచురల్ స్టార్ స్థాయికి ఎదిగారు. అవసరాల కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్ర‌ల‌ను చేస్తూనే.. డైరెక్టరుగా డిఫ‌రెంట్‌ చిత

'ఇంటిలిజెంట్‌' బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నా- ప్రభాస్‌

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న చిత్రం 'ఇంటిలిజెంట్‌'. టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. భారీగా వ్యూస్‌ సాధిస్తూ ట్రెండింగ్‌ అవుతోంది. 'ఇక మీదట పేదోడికి ప్లాట్‌ఫామ

నారా రోహిత్ హీరోగా ఎస్.డి.చక్రవర్తి దర్శకత్వంలో ఈ.ఎం.వి.ఈ స్టూడియోస్ చిత్రం

రొటీన్ కు భిన్నంగా వైవిధ్యమైన కథ-కథనాలను ఎంచుకుంటూ కథానాయకుడిగా

ఎన్ హెచ్ 47లో 'బూత్ బంగ్లా' గీతావిష్కరణ

ఏకే 9 స్టూడియోస్ ఫిలిమ్స్ సమర్పణలో అజయ్ కౌండిన్య,సంధ్య,అనూష హీరో,హీరోయిన్ గా