అక్టోబర్ లో 'శేఖరం గారి అబ్బాయి'

  • IndiaGlitz, [Friday,September 15 2017]

ఎం.ఎఫ్‌ క్రియేషన్స్‌ పతాకం పై అచ్చివర్స్ సిగ్నేచర్ బ్యానర్ లో హీరోయిన్‌ అక్షత దర్శకత్వంలో మద్దిపాటి సోమశేఖర రావు, మధు ఫోమ్రా నిర్మిస్తున్న చిత్రం 'శేఖరం గారి అబ్బాయి'. విన్ను మద్దిపాటి, అక్షత నాయకానాయికలు. ఇటీవల డా.మోహన్‌ బాబు లాంచ్‌ చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు చక్కని స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ని ప్రముఖ దర్శకులు శ్రీవాస్‌ ఆవిష్కరించారు.

విన్ను మద్దిపాటి ఈ చిత్రంతో కథానాయకుడుగా తెరంగేట్రం చేసారు, కథానాయిక అక్షత దర్శకురాలిగా వ్యవహరించడం ఓ విశేషం. సరైన ప్లానింగ్‌తో బడ్జెట్ కథకు తగిన విధంగా దర్శకురాలు అందరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా వైవిధ్యమైన కథనంతో తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా రూపొందింది. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి అక్టోబరు లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నరు. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం:సాయి యెలేందర్, కెమెరా:రాఘవ, ఎడిటింగ్:నందమూరి హరి, నిర్మాతలు:మద్దిపాటి సోమశేఖరరావు, మధుఫోమ్రా, దర్శకత్వం:అక్షత.

More News

ప్రతిక్షణం మలుపులతో శ్రీవల్లి కొత్త అనుభూతినిస్తుంది: రాజ్ కుమార్

కథలోని కొత్తదనానికి పెద్దపీట వేస్తూ సినిమాలు తీయాలన్నదే నిర్మాతలుగా మా లక్ష్యం. నేటి ట్రెండ్‌కు తగ్గ జనరంజక చిత్రాల్ని నిర్మించాలన్నదే మా అభిమతం.

సైరా.. ఆ వార్త నిజమేనా?

ఖైదీ నెం.150తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి.

3 నెలల గ్యాప్ లో సూపర్ స్టార్ 2 సినిమాలు

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలంటే..

ఐటమ్ సాంగ్ లో రాశి

ఊహలు గుసగుసలాడే చిత్రంలో హోమ్లీగా కనిపించి మెప్పించింది బొద్దుగుమ్మ రాశీ ఖన్నా.

ఆరేళ్ల తరువాత.. సునీల్ అలా

అందాల రాముడు,మర్యాద రామన్న చిత్రాలతో కథానాయకుడిగా మంచి పేరు తీసుకున్నాడు సునీల్.