మీ శ్రద్ధకు కృతజ్ఞుడిని... సీఎం జగన్‌కు కైకాల సత్యనారాయణ లేఖ

అనారోగ్యానికి గురై అపోలో ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కోలుకున్నారు. ఈ క్రమంలో తన అనారోగ్య సమయంలో సహాయం అందించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌కి లేఖ రాశారు.

బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా ఫోన్ చేసి, ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందిస్తామని హామీ ఇవ్వడం ద్వారా మీరు చూపిన శ్రద్ధకు చాలా సంతోషిస్తున్నా. మీరు హామీ ఇచ్చినట్టుగానే మీ ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా హాజరయ్యారు, వైద్య ఖర్చులను చెల్లించడానికి ఆర్థిక సహాయంతో సహా అన్ని రకాలుగా అండగా నిలిచారు. ఆ కష్ట సమయాల్లో మీ సహాయం నాకు, నా కుటుంబానికి అద్భుతమైన శక్తిని ఇచ్చింది.

మీరు చూపిన ఈ శ్రద్ధ మీకు కళాకారుల పట్ల , వారి శ్రేయస్సు పట్ల ఉన్న గౌరవాన్ని మరోసారి రుజువు చేసింది. ప్రజల పట్ల మీకు ఉన్న శ్రద్ధ రాష్ట్రం మంచి చేతుల్లో ఉందనే భరోసా ఇస్తుంది’ అని కైకాల ఆ లేఖలో పేర్కొన్నారు. తాను సంతకం చేయలేకపోవడంతో, తన కుమారుడు ఈ కృతజ్ఞతా లేఖపై సంతకం చేశారని సత్యనారాయణ అన్నారు. అలాగే తాను ఆసుపత్రిలో వున్నప్పుడు తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కైకాల కృతజ్ఞతలు తెలిపారు.

More News

టాలీవుడ్‌లో మరో విషాదం : నటుడు కన్నుమూత .. సంక్రాంతికి ఇంటికొచ్చి కానరాని లోకాలకు

తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది కరోనా, ఆరోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాలు తదితర కారణాలతో సినీ ప్రముఖులు కన్నుమూశారు.

"హీరో" సినిమాలో పర్మార్మెన్స్ తో ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న టాలెంటెడ్ హీరోయిన్ నిధి అగర్వాల్

తన కొత్త సినిమా "హీరో"తో ప్రేక్షకులను ఫిదా చేసేస్తోంది అందాల తార నిధి అగర్వాల్. గల్లా అశోక్ డెబ్యూ ఫిల్మ్ గా వచ్చిన హీరో చిత్రంలో నిధి గ్లామర్,

అలసిపోయా ఇక ఆడలేను.. ఇదే నా చివరి సీజన్ : టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సానియా

భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన టెన్నిస్ కెరీర్‌‌కు వీడ్కోలు ప్రణాళికలు వెల్లడించింది.

కేంద్రానికి రూ.30,791 కోట్ల బాకీ తీర్చిన రిలయన్స్ జియో

కేంద్ర ప్రభుత్వానికి రిలయన్స్ జియో బాకీ తీర్చేసింది. స్పెక్ట్రం కేటాయింపులకు సంబంధించి రూ.30,791 కోట్ల బకాయిలను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించినట్లు జియో ప్రకటించింది.

బాలయ్య టాక్ షోలో పాల్గొనాలని వుంది... వర్మ ట్వీట్ , అంతలోనే డిలీట్

సినిమాలు, రాజకీయాలు, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి వ్యవహారాలతో క్షణం తీరిక లేకుండా వుండే బాలయ్య..