రాజమౌళితో సినిమా చేస్తే ఏ హీరోకి పేరు రాదు.. కోటా సంచలన వ్యాఖ్యలు

సినిమా అంటే కేవలం హీరో, కథ మాత్రమే కాదు.. క్రియేటివిటీ అని చాటి చెప్పిన దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి అంటే పేరు కాదు... ఇట్సే బ్రాండ్....అందుకే హీరోలు కాకుండా ఆయన అనే పేరు మీదే బిజినెస్ జరిగేంతగా ఎదిగిపోయారు. రాజమౌళి ఈ తరం హీరోలకే హీరో. ఆయన సినిమాలో హీరోగా కాకున్నా కనీసం చిన్న పాత్రైనా చేస్తే చాలు అనుకునే నటీనటులు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వున్నారంటే అతిశయోక్తి కాదు. ఆయనకు గాలి, నీరు, తిండి, నిద్రా అన్నీ సినిమానే.. పర్ఫెక్షన్ కోసం ప్రాణం పెట్టే రాజమౌళిని జూనియర్ ఎన్టీఆర్ జక్కన్న అని ప్రేమగా పిలుస్తూ వుంటారు. స్టూడెంట్ నెంబర్ 1తో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. బాహుబలిగా టాలీవుడ్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌తో మరోసారి సినీ వినీలాకాశంలో తన కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు రాజమౌళి.

జక్కన్న తన సినిమాలో పనిచేసే హీరోలను ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేస్తాడు. ఎంతటి స్టార్‌డమ్‌ని తన హీరోకి సంపాదించి పెట్టాలో సంపాదించి పెడతాడు. అయితే రాజమౌళి సినిమాలో చేసిన ఓ హీరో తన తదుపరి ప్రాజెక్ట్‌లో అట్టర్ ఫ్లాప్ అవుతాడు. ఇంత వరకు రాజమౌళితో చేసిన హీరోలంతా ఈ గండాన్ని దాటలేకపోయారు. అది రాజమౌళి మహిమో.. లేక హీరోలకు శాపమో తెలియడం లేదు. అందుకే ఆయనతో సినిమా చేస్తే క్రెడిట్ అంతా ఆయనకే వెళ్లిపోతుంది తప్పించి.. నటీనటులకు కానీ టెక్నీషియన్లకు వెళ్లదని ఇండస్ట్రీలో అంటూ వుంటారు. తాజాగా ఈ అంశంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు.

indiaglitz‌తో మాట్లాడిన ఆయన తన సినీ, వ్యక్తిగత జీవితం, ప్రస్తుతం ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై తన మనసులోని మాటలను తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే రాజమౌళితో సినిమాలు చేసే, చేస్తున్న హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి సినిమాలో ఏ ఆర్టిస్ట్‌కి పేరు రాదని కోటా కుండబద్ధలు కొట్టారు. ఇలాగే ఎందుకు జరుగుతుందంటే తన వద్ద సమాధానం లేదంటూ ఒక ఉదాహరణ చెప్పారు. గతంలో రామానాయుడితో సినిమాలు చేసే వారు.. ఏ డైరెక్టర్‌తో సినిమాలు చేస్తున్నావని అడిగితే నాయుడిగారి సినిమాలో చేస్తున్నామని చెప్పుకునేవారని శ్రీనివాసరావు వెల్లడించారు. అలాగే రాజమౌళికి కూడా ఆ బ్రాండ్ వచ్చేసిందని కోటా తెలిపారు. ఆయన దర్శకత్వంలో స్టూడెంట్ నెం 1, ఛత్రపతి సినిమాల్లో నటించానని.. తర్వాత మళ్లీ రాజమౌళి నుంచి తనకు పిలుపు రాలేదని కోటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మరి ఈ వ్యాఖ్యలపై హీరోలు, వారి అభిమానులు, ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

More News

చర్యలు తీసుకోకుండా, తల్లి పెంపకమే తప్పు అంటారా... ఏపీలో అత్యాచారాలపై నాదెండ్ల మనోహర్ ఆగ్రహం

రాష్ట్రంలో వరుసగా ఆడబిడ్డలపై అత్యాచారాలు, వేధింపులపై జనసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

మేజర్ ట్రైలర్ : చూస్తున్నంత సేపు ఉద్వేగం.. సెల్యూట్ కొట్టాల్సిందే

26/11 ముంబయి ఉగ్రవాద దాడుల్లో అమరుడైన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా అడివి శేష్ హీరోగా ‘‘మేజర్’’

ఒక్కసారి అవకాశమివ్వండి.. కోట్ల మంది కన్నీరు తుడుస్తా : కౌలు రైతుల భరోసా యాత్రలో పవన్

ఒక్కసారి అవకాశమిస్తే.. కోట్ల మంది కన్నీరు తుడుస్తానన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

కర్నూలు జిల్లాలోని కొణిదెల నా ఇంటి పేరు.. భయపెడితే భయపడే రకం కాదు: పవన్ కల్యాణ్

కర్నూలు మసూరి బియ్యానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వుందని.. .

సింగిల్‌గా రమ్మనడానికి మీరెవరు.. మీ అతి తగ్గించుకోండి : వైసీపీ నేతలకు పవన్ హెచ్చరిక

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.