Jamuna : మూడేళ్ల పాటు నిషేధం.. ధైర్యంగా నిలబడ్డ జమున, నాగిరెడ్డి-చక్రపాణి జోక్యంతో రాజీ


Send us your feedback to audioarticles@vaarta.com


ఇప్పుడంటే చిత్ర పరిశ్రమలో ఇష్టారాజ్యంగా తయారైంది కానీ ఒకప్పుడు షూటింగ్‌కు నటీనటులంతా షూటింగ్‌కు దర్శక నిర్మాతలు చెప్పిన టైమ్‌కి వచ్చేసేవారు. మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్ , కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజులతో పాటు ఆ తరంలోని నటులంతా ఉదయాన్నే మేకప్ వేసుకుని ఇంటి దగ్గర రెడీగా వుండేవారు. కారు రావడం వారిని షూటింగ్ స్పాట్‌కి తీసుకెళ్లడం జరిగిపోయేవి. నిమిషం ఆలస్యమైనా ఆ రోజుల్లో దర్శకులు ఒప్పుకునేవారు కాదు. అంతటి క్రమశిక్షణతో వుండేవారు కాబట్టే వారంతా మహానటులు అయ్యారు, ఆ కాలం తెలుగు సినీ స్వర్ణ యుగమైంది.
జమున కాల్షీట్ల కోసం పడిగాపులు :
ఇదిలావుండగా.. ఆ తరానికి ప్రతినిధిగా వున్న సీనియర్ నటి జమున ఈరోజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. తిరిగిరాని లోకాలకు తెలుగింటి సత్యభామ తరలిపోవడంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు. పొగరు వగరు కలబోసిన అందం జమున సొంతం. దాదాపు మూడు దశాబ్ధాల పాటు తెలుగు తెరను ఆమె మకుటం లేని మహరాణిలా ఏలారు. జమున కాల్షీట్ల కోసం దర్శక నిర్మాతలు ఎదురుచూసేవారంటే ఆమె స్థాయి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. జముననే నమ్ముకుని ఎంతోమంది సినిమాలు చేసుకుని ఆర్ధికంగా నిలదొక్కుకున్నారు.
జమునపై మూడేళ్ల పాటు బ్యాన్ :
అయితే జమున ఒకటి రెండు సార్లు షూటింగ్‌కు ఆలస్యం రావడంతో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తదితర నటులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో ఇండస్ట్రీ అంతా ఒక్కటై ఆమెను మూడేళ్ల పాటు తెలుగు సినిమాల్లో నటించకుండా నిషేధం విధించారట. అయినప్పటికీ జమున ధైర్యంగానే నిలబడ్డారు. తెలుగు చిత్ర సీమలో తనకు అవకాశాలు రాకపోవడంతో మిగిలిన పరిశ్రమలు .. ముఖ్యంగా హిందీలో సినిమాలు చేసి విజయాలు అందుకున్నారట. అటు మిగిలిన భాషల్లోనూ జమునకు తిరుగులేని ఆదరణ లభించింది. అయితే ప్రతిభ గల నటిని తెలుగు చిత్ర పరిశ్రమ కోల్పోకూడదన్న ఉద్దేశంలో అప్పటి సినీ పెద్దలైన నాగిరెడ్డి, చక్రపాణి తదితరులు ఆమె విషయంలో రాజీ కుదిర్చారట. దీంతో వివాదం సద్దుమణిగి జమున మళ్లీ తెలుగు సినిమాలు చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.