నటి కవిత ఇంట్లో తీవ్ర విషాదం.. కొడుకు మృతి, భర్త ఆరోగ్యం కూడా..

  • IndiaGlitz, [Thursday,June 17 2021]

ప్రముఖ సీనియర్ నటి కవిత కుటుంబంలో తీవ్ర విషాదం ఎదురైంది. కరోనా మహమ్మారి ఎంతమంది ప్రాణాలు బలిగొంటుందో అర్థం కానీ పరిస్థితి. కరోనా ధాటికి వరుసగా సెలెబ్రిటీల కుటుంబాల్లో విషాదాలు జరుగుతున్నాయి. దేశంలో వరుసగా కరోనా ప్రభావంతో ప్రముఖుల మరణ వార్తలు వింటూనే ఉన్నాం. తాజాగా కరోనా సీనియర్ నటి కవిత ఇంట్లో విషాదాన్ని మిగిల్చింది.

కరోనాతో కవిత కుమారుడు సంజయ్ రూప్ మరణించాడు. గత కొంత కాలంగా సంజయ్ రూప్ కరోనాతో హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నాడు. ఇటీవల అతడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ సంజయ్ రూప్ తుది శ్వాస విడిచాడు. దీనితో కవిత కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

ఈ విషాదానికి తోడు కవిత కుటుంబాన్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేలా మరో కష్టం వచ్చింది. ఆమె భర్త దశరధరాజ్ కి కూడా కరోనా సోకడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారట. ఆయన ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని సమాచారం. మహమ్మారి కరోనా కుటుంబాలని ఎలా ఛిద్రం చేస్తోందో చెప్పడానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ.

నటి కవిత చిత్ర పరిశ్రమలో సీనియర్ మోస్ట్ యాక్టర్. 11 ఏళ్ల ప్రాయంలోనే ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా నటన మొదలు పెట్టారు. తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి లాంటి దిగ్గజాల చిత్రాల్లో కీలక పాత్రల్లో ఆమె నటించారు. హీరోయిన్ గానూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ రాణించారు.

More News

త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో యూఎస్‌లో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను ఏర్పాటు చేసిన హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో యూఎస్‌లో 'అలా అమెరికాపురములో..` పేరుతో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను ఏర్పాటు చేసిన హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌.

ఇజ్రాయెల్ యుద్ధ విద్యల్లో నాగ్ శిక్షణ.. 'రా' ఏజెంట్ గా బీభత్సమే!

ప్రయోగాలకు ఎప్పుడూ సంసిద్ధంగా ఉండే స్టార్ కింగ్ నాగార్జున. తన సినీ కెరీర్ లో నాగార్జున తన ఇమేజ్ నుంచి బయటకు వచ్చి అనేక చిత్రాలు చేశారు.

పాపనాశం 2: పాతికేళ్ల తర్వాత కమల్ తో.. గౌతమి ప్లేస్ లో ఆమె..

దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం అన్ని భాషల్లో ఘనవిజయం సాధించింది. ఇటీవలే దృశ్యం 2 కూడా మలయాళంలో విడుదలయింది.

హీరోతో సమానంగా.. 'రంగస్థలం' నటుడికి బంపర్ ఆఫర్?

సపోర్టింగ్ రోల్స్ చేసే నటులకు హీరోలతో సమానంగా పాత్ర దొరకడం చాలా అరుదుగా ఉంటుంది.

స్టన్నింగ్ హాట్: పర్పుల్ డ్రెస్ లో మతిపోగొడుతున్న రష్మిక

సౌత్ లో రష్మిక మందన తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక..