అలనాటి ప్రముఖ నటి సీత మృతి

  • IndiaGlitz, [Monday,September 21 2020]

అలనాటి ప్రముఖ నటి, నటుడు నాగభూషణం సతీమణి సీత(87) నేడు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలోఆమె తుదిశ్వాస విడిచారు. కొన్ని వందల చిత్రాలలో ఆమె నటించారు. దేవదాసు, మాయాబజార్ వంటి ఎన్నో చిత్రాల ద్వారా మంచి నటిగా సీత గుర్తింపు తెచ్చుకున్నారు. భర్త నాగభూషణంతో కలిసి ఆమె ఒక డ్రామా ట్రూప్‌ను కూడా నడిపారు. నాగభూషణంకి అత్యంత పేరు తెచ్చి పెట్టిన నాటిక ‘రక్త కన్నీరు’. అప్పటి నుంచే ఆయనకు ‘రక్త కన్నీరు’ నాగభూషణంగా పేరు పడింది. ఈ నాటికంలో సీత కీలక పాత్ర పోషించారు. సుందరి అనే వాంప్ పాత్రలో సీత నటించారు.

భర్త నాగభూషణానికి చేదోడు వాదోడుగా సీత నిలిచేవారు. దీంతో ఆమెను ఇండస్ట్రీలో నాగభూషణం సీతగానే పిలిచేవారు. సీత కుటుంబంలో అందరూ సినిమా రంగానికి చెందిన వారే కావడం విశేషం. ఈమె తల్లిదండ్రులు సినిమా నటీనటులు. సీత నాలుగేళ్ల ప్రాయంలో త్యాగభూమి అనే సినిమాలో తొలిసారి నటించింది. అయితే నాగభూషణానికి సీత రెండో భార్య కావడం గమనార్హం. సీత అంత్యక్రియలు మహాప్రస్థానం శ్మశాన వాటికలో నిర్వహించారు.

More News

దేశంలోనే తొలిసారిగా సరికొత్త యాప్‌ను రూపొందించిన ఏపీ పోలీస్ శాఖ ..

దేశంలోనే తొలిసారిగా ఏపీ పోలీస్‌ శాఖ సరికొత్త యాప్‌ను రూపొందించింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ స్టేషన్‌‌కు వెళ్లే అవసరం లేకుండా

ఆసక్తికర అంశాలతో ‘నిశ్శబ్దం’ ట్రైలర్ విడుదల..

అనుష్క ఒక ఛాలెంజింగ్ పాత్రలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. ఈ చిత్రంలో మాధవన్ మరో కీలక పాత్రను పోషించారు.

అనురాగ్‌కశ్యప్‌కి పెరుగుతున్న మద్దతు

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌కు ఇండస్ట్రీ సెలబ్రిటీల నుండి మద్దతు దొరుకుతుంది.

నిర్మాత నట్టికుమార్ కుమార్తె నట్టి కరుణ ‘DSJ’ ‘దెయ్యంతో సహజీవనం...’ మూవీతో తెరంగేట్రం

నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ కుమార్తె నట్టి కరుణ ప్రధాన పాత్రలో ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం...)

అనుష్క ఫస్ట్‌ ఛాయిస్‌ కాదా..?

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'నిశ్శబ్దం'. రీసెట్‌గా గాంధీ జయంతి రోజున నిశ్శబ్దం సినిమాను అక్టోబర్‌ 2న విడుదల చేస్తున్నట్లు తెలిపారు.