ప్ర‌భాస్ కొత్త చిత్రంలో బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్‌!!

  • IndiaGlitz, [Tuesday,January 21 2020]

బాహుబ‌లి సినిమాతో నేష‌న‌ల్ రేంజ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ త‌ర్వాత వ‌చ్చిన సాహోతో ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని మాత్రం అందుకోలేక‌పోయాడు. అయితే ఈసారి చేస్తున్న పీరియాడికల్ లవ్‌స్టోరీ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకుంట‌న్నాడు.రీసెంట్‌గా ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ భాగ్య‌శ్రీ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. సోమ‌వారం నుండి ఆమె షూటింగ్‌లో పాల్గొంటున్నార‌ట‌.

1970 బ్యాక్‌డ్రాప్‌తో లింక్ అవుతూ నేటి కాలానికి కొన‌సాగే ప్రేమ‌క‌థాశంతో ఈ సినిమా ఉంటుంద‌ట‌. పూర్వ‌జ‌న్మ‌లో ధ‌న‌వంతుడిగా ప్ర‌భాస్‌, పేద అమ్మాయిగా పూజా హెగ్డే పుడుతుంద‌ట‌. ఆ స‌మ‌యంలో విఫ‌ల‌మైన వారి ప్రేమ ఇప్ప‌టి కాలంలో ఎలా క‌లిసింద‌నేదే క‌థ‌ట‌. ప్ర‌భాస్ ఇందులో హ‌స్త‌సాముద్రిక తెలిసిన వ్య‌క్తిగా క‌న‌ప‌డ‌బోతున్నాడ‌ట‌. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. యువీ క్రియేష‌న్స్‌, గోపీకృష్ణ‌మూవీస్ ప‌తాకాల‌పై సినిమా నిర్మిత‌మ‌వుతోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

More News

మూడో స్థానం కోసం బ‌న్నీ ప‌రుగు...చేరుకుంటాడా?

వ‌రుస సినిమాలు చేస్తూ ఓ కూల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చేయాల‌నుకున్న బ‌న్నీ దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్నాడు.

ప‌క్కా మాస్ టైటిల్‌తో వెంక‌టేశ్ `అసుర‌న్‌`

త‌మిళంలో ధ‌నుష్ హీరోగా న‌టించిన చిత్రం `అసుర‌న్‌`. వెట్రిమార‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో వెంక‌టేశ్ హీరోగా రీమేక్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

`RRR` టీమ్‌తో జ‌త క‌ట్టిన బాలీవుడ్ స్టార్‌

ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తోన్న చిత్రం `RRR`. `బాహుబ‌లి` వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం

ఇక రెండు నెల‌లు మ‌హేశ్ క‌న‌ప‌డ‌డు...!!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ఈ సంక్రాంతికి `స‌రిలేరునీకెవ్వ‌రు`తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. పెద్ద స‌క్సెస్‌ను సొంతం చేసుక‌న్న సంగ‌తి తెలిసిందే.

`పింక్` మొద‌లెట్టిన ప‌వ‌న్‌.. వైర‌ల్ అవుతున్న ప‌వ‌న్ ఫొటో

జ‌న‌సేన‌నాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ సినిమా `పింక్‌`ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.