close
Choose your channels

ప్రభాస్ మూవీలో విలన్‌గా సీనియర్ హీరో!

Thursday, February 13, 2020 • తెలుగు Comments

ప్రభాస్ మూవీలో విలన్‌గా సీనియర్ హీరో!

‘బాహుబలి, ‘సాహో’ లాంటి భారీ బడ్జెట్‌ చిత్రాల అనంతరం యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘జాన్’ (వర్కింగ్ టైటిల్). రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ‘రాధేశ్యాం’, ‘ఓ డియర్’ అనే టైటిల్‌ను రిజిస్ట్రేషన్ చేయించారని వార్తలు వచ్చిన విషయం విదితమే. అయితే ఈ సినిమాకు సంబంధించి చాలానే పుకార్లు వచ్చినప్పటికీ ఇంతవరకూ చిత్రబృందం మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలుగుచూసింది.

ఈ సినిమాలో ప్రభాస్‌ను జగపతి బాబు ఢీ కొట్టబోతున్నాడన్నదే ఆ అప్డేట్ సారాంశం. జగపతి పాత్రను చాలా డిఫరెంట్‌గా మలిచినట్టు తెలుస్తోంది.  అయితే ఈ సినిమాలో నటించబోయే పాత్రలో ఇదివరకెప్పుడూ జగపతి బాబు నటించలేదని తెలుస్తోంది. ఈ సినిమాలో పాత్ర మాత్రం అదిరిపోతుందని సమాచారం. మరీ ముఖ్యంగా జగపతి బాబు లుక్, డైలాగ్ డెలివరీ భిన్నంగా ఉంటుందట. అంటే.. ‘అల వైకుంఠపురములో’ సముద్రఖనిలాగా మూతి తిప్పినట్లుండేలా ఉంటుందట. అయితే ఇంతవరకూ దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. టైటిల్ ఫిక్స్ అయిన తర్వాత ప్రభాస్, పూజాతో పాటు జగపతి లుక్స్ రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తోందట.

Get Breaking News Alerts From IndiaGlitz