close
Choose your channels

నాగ‌చైత‌న్య‌ను డైరెక్ట్ చేయ‌నున్న సీనియ‌ర్ హీరో..!

Friday, October 30, 2020 • తెలుగు Comments

నాగ‌చైత‌న్య‌ను డైరెక్ట్ చేయ‌నున్న సీనియ‌ర్ హీరో..!

టాలీవుడ్ యంగ్ హీరోస్‌లో ఒక‌రైనా నాగ‌చైత‌న్య అక్కినేని వ‌రుస ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా ఉన్నాడు. తాజా సినీ వ‌ర్గాల క‌థ‌నాల మేర‌కు ఈ హీరో మ‌రో కొత్త ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పార‌ని, ఆ ప్రాజెక్ట్‌ను ఓ సీనియ‌ర్ హీరో డైరెక్ట్ చేస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కూ ఆ సీనియ‌ర్ హీరో ఎవ‌రో కాదు.. అర్జున్‌. హీరో, నిర్మాత‌, ద‌ర్శ‌కుడైన అర్జున్ ఇప్ప‌టికే కొన్ని విజ‌య‌వంత‌మైన సినిమాల‌ను డైరెక్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా ఈయ‌న చైత‌న్య‌కు ఓ స్టోరిని వినిపించాడ‌ట‌. చైత‌న్య‌కు కూడా స్క్రిప్ట్ బాగా న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి త‌ను ఓకే అన్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందోన‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో సాయిప‌ల్ల‌వితో క‌లిసి `ల‌వ్‌స్టోరి` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది పూర్తి కాగానే దిల్‌రాజు శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై విక్రమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `థాంక్యూ` సినిమాలో న‌టించ‌బోతున్నారు. మ‌రో వైపు చైత‌న్య నిర్మాణంలోనూ పూర్తిస్థాయిలో దిగ‌బోతున్న‌ట్లు ఇప్ప‌టికే అందుకు సంబంధించిన ప‌నులు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే చైత‌న్య నిర్మాణ సంస్థ‌లో రానున్న సినిమా గురించిన ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డే అవ‌కాశం ఉంది.

Get Breaking News Alerts From IndiaGlitz