నాగ‌చైత‌న్య‌ను డైరెక్ట్ చేయ‌నున్న సీనియ‌ర్ హీరో..!

  • IndiaGlitz, [Friday,October 30 2020]

టాలీవుడ్ యంగ్ హీరోస్‌లో ఒక‌రైనా నాగ‌చైత‌న్య అక్కినేని వ‌రుస ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా ఉన్నాడు. తాజా సినీ వ‌ర్గాల క‌థ‌నాల మేర‌కు ఈ హీరో మ‌రో కొత్త ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పార‌ని, ఆ ప్రాజెక్ట్‌ను ఓ సీనియ‌ర్ హీరో డైరెక్ట్ చేస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కూ ఆ సీనియ‌ర్ హీరో ఎవ‌రో కాదు.. అర్జున్‌. హీరో, నిర్మాత‌, ద‌ర్శ‌కుడైన అర్జున్ ఇప్ప‌టికే కొన్ని విజ‌య‌వంత‌మైన సినిమాల‌ను డైరెక్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా ఈయ‌న చైత‌న్య‌కు ఓ స్టోరిని వినిపించాడ‌ట‌. చైత‌న్య‌కు కూడా స్క్రిప్ట్ బాగా న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి త‌ను ఓకే అన్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందోన‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో సాయిప‌ల్ల‌వితో క‌లిసి 'ల‌వ్‌స్టోరి' సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది పూర్తి కాగానే దిల్‌రాజు శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై విక్రమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో 'థాంక్యూ' సినిమాలో న‌టించ‌బోతున్నారు. మ‌రో వైపు చైత‌న్య నిర్మాణంలోనూ పూర్తిస్థాయిలో దిగ‌బోతున్న‌ట్లు ఇప్ప‌టికే అందుకు సంబంధించిన ప‌నులు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే చైత‌న్య నిర్మాణ సంస్థ‌లో రానున్న సినిమా గురించిన ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డే అవ‌కాశం ఉంది.

More News

హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయిన నోయెల్..

ఓపెనింగే.. నోయెల్ అర్థరాత్రి అందరూ పడుకున్నాక తన ఆరోగ్య సమస్యతో బాధ పడటం చాలా కలచి వేసింది.

బుల్లితెరపై కూడా ఆకట్టుకోలేక పోయిన ‘సాహో’..

యంగ్ రెబల్ స్టార్‘బాహుబలి’తరువాత భారీ అంచనాలతో పాటు భారీ బడ్జెట్‌తో వచ్చిన చిత్రం ‘సాహో’.'రన్‌ రాజా రన్‌' ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో

పసుపు వేడుకలో మెరిసిపోయిన కాజల్

స్టార్ హీరోయిన్ కాజల్ పెళ్లి మరికొన్ని గంటల్లో జరగనుంది. ఇప్పటికే వివాహ వేడుకలు అంగరంగ ప్రారంభమయ్యాయి.

అతనికి ఎస్ చెప్పానంటూ ఫోటో రివీల్ చేసిన పునర్నవి..

ప్రముఖ నటి, బిగ్‌బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం తనకు కాబోయే వ్యక్తికి సంబంధించిన వివరాలను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ వస్తోంది.

సుమంత్‌ 'కపటధారి' టీజర్‌ విడుదల

" ఈ ప్రపంచంలో ఏదీ ఊరికే జరగదు. అన్నిటికీ ఓ కారణం ఉంటుంది" అని అంటున్నారు హీరో సుమంత్‌.