close
Choose your channels

ప్రముఖ సినీ జర్నలిస్ట్ పసుపులేటి ఇకలేరు..

Tuesday, February 11, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రముఖ సినీ జర్నలిస్ట్ పసుపులేటి ఇకలేరు..

ప్రముఖ సినీ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. యూరిన్ ఇన్ఫెక్షన్‌కు గురైన ఆయన్ను ఆదివారం నాడు వనస్థలిపురంలోని మెడిసిన్స్ ఆస్పత్రిలో చేర్పించారు. మంగళవారం ఉదయం ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని ఇందిరానగర్‌లోని ఆయన స్వగృహానికి తీసుకొస్తున్నారు. ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రజ్యోతి’ సంస్థ నుంచి వెలువడే జ్యోతి చిత్ర సినిమా వారపత్రిక, శివరంజని, సంతోషం తదితర సినిమా పత్రికలలో పనిచేశారు. అనేక సినిమాలకు పీఆర్వోగా వ్యవహరించారు.

ప్రముఖ సినీ జర్నలిస్ట్ పసుపులేటి ఇకలేరు..

చిరుతో మంచి సాన్నిహిత్యం!

అంతేకాదు.. విశాలాంధ్ర పత్రికతో పాటు పలు పత్రికలకు జర్నలిస్ట్‌గా పనిచేశారు. ప్రస్తుతం ‘సంతోషం’ సినీ పత్రికకు జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. కాగా.. పసుపులేటికి మెగాస్టార్ చిరంజీవికి మంచి సాన్నిహిత్యం ఉండేది. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో చిరునే ఆయన హెల్త్ టెస్ట్‌లు కూడా చేయించారని చెబుతుంటారు. అయితే చిరు ఒక్కరితోనే కాదు ఇండస్ట్రీలో సీనియర్ నటీనటులతో రామారావుకు మంచి పరిచయాలున్నాయి. పసుపులేటి ఇకలేరన్న విషయం తెలుసుకున్న నటీనటులు, పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలిపిన ప్రముఖులు.. కుటుంబ సభ్యులు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఇప్పుడుడిప్పుడే ప్రముఖులు పసుపులేటి ఇంటికి చేరుకుంటున్నారు.

రామారావు గురించి మూడు ముక్కల్లో..!

పసుపులేటి రామారావు స్వస్తలం ఏలూరు. డిగ్రీ చదివిన ఆయన ప్రజానాట్యమండలి, కమ్యూనిస్టు పార్టీలో యాక్టివ్ మెంబర్‌గా పనిచేసారు. పసుపులేటి ఎన్టీఆర్‌, ఏఎన్నార్, జగ్గయ్య, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు.. ఆ తర్వాత తరం చంద్రమొహన్, మురళీ మోహన్, మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్.. అలాగే ఇప్పటి తరం హీరోలతోను, హీరోయిన్లతో, పెద్ద, చిన్న నిర్మాతలతోను, 24 భాగాలకు సంబంధించిన సాంకేతిక నిపుణులతోను ఇంటర్య్వులు తీసుకున్నారు. అంతేకాదు.. ఆ ఇంటర్వ్యూల్లో ఎంపిక చేసిన కొన్నింటిని ‘నాటి మేటి సినీ ఆణిముత్యాలు’ అనే పేరుతో పుస్తకరూపంలో కూడా తీసుకువచ్చారు. దర్శకరత్న, దివంగత దాసరి నారాయణ రావు జీవితంపై పసుపులేటి ‘తెరవెనుక దాసరి’ అనే పుస్తకాన్ని రాశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.