తదుపరి సినిమాపై క్లారిటీ ఇచ్చిన సెన్సేషన్ డైరెక్టర్

  • IndiaGlitz, [Wednesday,August 07 2019]

మహానటి సావిత్రి బయోపిక్ 'మహానటి' సెన్సేషనల్ హిట్ కావడంతో ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. 'ఎవడే సుబ్రమణ్యం'తో మంచి డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న నాగి... 'మహానటి'తో టాప్ డైరెక్టర్ అయ్యాడు. స్టార్ హీరోలందరూ ఈయనతో కలిసి పనిచేయాలనుకున్నారు. కానీ నాగ్ అశ్విన్ ఏ మాత్రం తొందరపడలేదు. చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత తదుపరి సినిమాను ప్రకటించాడు నాగ్ అశ్విన్. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ ఎవరనేది చెప్పలేదు కానీ.. తన సినిమా సెప్టెంబర్‌లో ప్రారంభం అవుతుందని పేర్కొన్న ఈ యువ దర్శకుడు తన సినిమా కోసం పనిచేయడానికి స్క్రిప్ట్ రైటర్స్, డిజైనర్స్ , విజువల్ ఆర్టిస్టులు కావాంటూ ప్రకటన కూడా ఇచ్చాడు. ఈ చిత్రాన్ని కూడా వైజయంతీ మూవీస్ నిర్మించనుంది.

More News

'ఇండియన్ 2' కోసం కాజల్ కష్టాలు

హీరోలు, హీరోయిన్లను చూసి వీరికేం బాగానే ఉన్నారుగా? అని మనం అనుకుంటాం. కానీ వారు ప్రేక్షకులను మెప్పించడానికి..

షర్ట్ విప్పబోతున్న నాని...

నేటి తరం కుర్ర హీరోలు నటన, డ్యాన్సులు, ఫైట్స్ మీదే కాదు.. ఫిజిక్ మీద కూడా స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు.

మహేష్ బాబు ముఖ్య అతిధిగా దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ - 2019

భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ 2019కి తెరలేచింది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖుల్ని ఈ సందర్భంగా సత్కరించనున్నారు.

హ‌ృతిక్ కుటుంబంలో విషాదం

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తాతయ్య, ప్రముఖ సీనియర్ దర్శక నిర్మాత జె.ఓం ప్రకాశ్(93) కన్నుమూశారు.

కశ్మీర్‌పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

కశ్మీర్ అంశంపై ఓ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.