గుడ్ న్యూస్ చెప్పిన ‘సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా’.. ఉచితంగా వ్యాక్సిన్..

  • IndiaGlitz, [Sunday,August 23 2020]

భారతీయులందరికీ ‘సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ ప్రతినిధులు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే కరోనా నుంచి విముక్తి కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్న సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ‘కోవిషీల్డ్’ అన్న కరోనా వ్యాక్సిన్‌ను అక్టోబర్ చివరి నాటికి అంటే 73 రోజుల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది. భారతీయులందరికీ వ్యాక్సిన్‌ను నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కింద భారత ప్రభుత్వం ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందజేయనున్నట్టు సంస్థ వెల్లడించింది.

ఇప్పటికే భారత ప్రభుత్వం తమకు లైసెన్స్ ఇచ్చిందని.. ట్రయల్స్ ప్రోటోకాల్స్‌ను కూడా వేగవంతం చేసినట్టు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు తెలిపారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. తాము నిర్వహిస్తున్న క్లినికల్ ట్రయల్స్ 58 రోజుల్లో పూర్తవుతుందని.. మూడో దశ ట్రయల్స్‌లో ఇవ్వాల్సిన మొదటి దశ క్లినికల్ ట్రయల్స్‌ను శనివారం నిర్వహించామని.. రెండో దశను మరో 29 రోజుల తర్వాత ప్రయోగిస్తామని వెల్లడించారు. అయితే రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన ఫలితం 15 రోజుల్లో వెల్లడవుతుందని.. అనంతరం వ్యాక్సిన్‌ను మార్కెట్‌లో విడుదల చేయాలని తాము భావిస్తున్నామని.. ఇందుకోసం ఏర్పాటు పూర్తి చేస్తున్నామని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఈ సంస్థకు చెందిన క్లినికల్ ట్రయల్స్ శరవేగంగా నిర్వహిస్తున్నారు. మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ 17 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క కేంద్రంలో సుమారు వంద మందిపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ను మరో 73 రోజుల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామని సంస్థ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇండియాలో డిసెంబర్ నాటికి కరోనా అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

More News

తెలంగాణలో రెండో రోజు 2 వేల మార్కును దాటేసిన కరోనా కేసులు..

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు కూడా రాష్ట్రంలో కరోనా కేసులు రెండు వేల మార్కును దాటేశాయి.

ఎస్పీ బాలు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసిన ఎంజీఎం..

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్‌ను ఎంజీఎం వైద్యులు విడుదల చేశారు.

వచ్చే నెల చివరి నాటికి అందుబాటులోకి రష్యా వ్యాక్సిన్!

కరోనా వ్యాక్సిన్ విషయంలో రష్యా ప్రపంచ దేశాలన్నింటికన్నా ముందున్న విషయం తెలిసిందే. సడెన్‌గా కరోనా వ్యాక్సిన్‌కి అనుమతి లభించిందని వెల్లడించి షాక్ ఇచ్చిన రష్యా..

మెగాస్టార్ అభిమానులకు ఐ ఫీస్ట్.. ‘ఆచార్య’ మోషన్ పోస్టర్..

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేడు. మరి ఈ సందర్భంగా సర్‌ప్రైజ్ లేకుంటే ఎలా? ‘ఆచార్య’ మూవీ నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్ వచ్చింది.

అన్నయ్య చెయ్యి పట్టుకుని పెరిగాను: చిరుకు పవన్ బర్త్‌డే విషెస్

మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.